Sree Vishnu: శ్రీ విష్ణు.. విభిన్న కథలను ఎంచుకోవడంలో బ్రాండ్ అంబాసిడర్. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ మొదలుపెట్టి..హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. అప్పట్లో ఒకడుండేవాడు అనే సినిమా ద్వారా శ్రీ విష్ణు హీరోగా మారాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేనప్పటికీ.. శ్రీ విష్ణుకు మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత హీరోగా మెంటల్ మాదిలో, నీది నాది ఒకటే కథ, బ్రోచేవారెవరురా, తిప్పారు మీసం, గాలి సంపత్, రాజరాజచోరా, సామజవరాగమనా.. ఇలా మంచి మంచి కథలతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక కథలను ఎంచుకోవడంలోనే కాదు.. పుట్టినరోజు జరుపుకోవడంలో కూడా శ్రీవిష్ణు చాలా స్పెషల్. అవునండీ.. సాధారణంగా.. ప్రతి ఒక్కరి పుట్టినరోజు ఏడాదికి ఒకసారి వస్తుంది. కానీ, శ్రీవిష్ణుకు మాత్రం నాలుగేళ్లకు ఒకసారి వస్తుంది. అదేంటి అంటే.. శ్రీవిష్ణు.. లీప్ ఇయర్ లో అంటే ఫిబ్రవరి 29 న పుట్టాడు కాబట్టి. ఇది చాలా రేర్. చాలా తక్కువమంది ఈరోజున జన్మిస్తారు అన్నమాట.
ఇప్పటివరకు హాలీవుడ్, బాలీవుడ్ లో ఈరోజు పుట్టిన సెలబ్రిటీల గురించి విన్నాం కానీ, మొట్టమొదటిసారి ఒక తెలుగు హీరో లీప్ ఇయర్ న పుట్టినట్లు వింటున్నాం. ఇక ఈరోజు ఈ హీరో తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాడు. తాజాగా ఒక వీడియోలో తన పుట్టినరోజు గురించి శ్రీవిష్ణు మాట్లాడాడు. నాలుగేళ్లుగా పుట్టినరోజు జరుపుకోలేదు.. లీప్ ఇయర్ రోజున పుట్టడంతో నా ఫ్రెండ్స్, ఫ్యామిలీనే నా పుట్టినరోజును సెలబ్రేట్ చేస్తారు అని చెప్పుకొచ్చాడు. ఈరోజు తరువాత మరో నాలుగేళ్ళ తరువాతే శ్రీవిష్ణు పుట్టినరోజును జరుపుకోనున్నాడు. అందుకే ఈ నాలుగేళ్లు అతనికి గుర్తుండిపోయేలా బర్త్ డే విషెస్ చెప్పేద్దామా.. ఇలాగె కొత్త కొత్త కథలను ఎంచుకొని, మంచి హిట్లు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్టీవీ ప్రేక్షకుల తరుపున హ్యాపీ బర్త్ డే శ్రీవిష్ణు.