Mohammed Shami : “ఆ రోజే క్రికెట్‌కు గుడ్ బై”.. రిటైర్మెంట్‌పై షమీ సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammed Shami : టీమిండియా టాప్ బౌలర్ మహమ్మద్ షమీ తాజా తన రిటైర్మెంట్ వార్తలతో ఒక్కసారిగా వైరల్ అయ్యారు. ఈ 35 ఏళ్ల సీనియర్ ఫాస్ట్ బౌలర్ తన రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలకు తాజాగా తెరదించారు. తనకు ఆటపై విసుగు పుట్టేంత వరకు క్రికెట్‌కు వీడ్కోలు పలకబోనని స్పష్టం చేశారు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఈ స్టార్ బౌలర్ తన మనసులోని మాటలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నేను అలసిపోయినప్పుడు, నా నిర్ణయాలు నేనే తీసుకుంటాను. కానీ ప్రస్తుతానికి, నేను రిటైర్మెంట్ గురించి ఆలోచించడం కూడా లేదు, ఎందుకంటే అలాంటి ఆలోచనలు మిమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తాయి” అని అన్నారు.
READ ALSO: Allu Arjun : ఐకాన్ స్టార్ బర్త్ డే.. ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ చెప్పిన బన్నీ వాసు
Also Read
రిటైర్మెంట్ నిర్ణయం పూర్తిగా తన సొంత నిర్ణయమని, ఎంపిక, వయసు, లేదా గాయం కారణంగా కాదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. షమీ మాట్లాడుతూ.. “మీరు రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నారంటే, మీరు అలసిపోయారని అర్థం. మీరు అలసిపోయారంటే, మీకు విసుగు పుట్టిందని అర్థం. నేను ఇంతకు ముందే చెప్పాను, ఏ రోజు ఉదయం నిద్రలేచినప్పుడు నాకు విసుగు అనిపిస్తుందో, ఆ రోజు నేను క్రికెట్‌కు గుడ్ బై చెబుతాను” కుండ బద్దలు కొట్టారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. షమీ చివరిసారిగా 2025లో నిర్వహించిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున ఆడాడు. బెంగాల్ తరఫున 67 వికెట్లు తీసి దేశీయ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, నాటి నుంచి ఈ స్టార్ బౌలర్ దాదాపు ఏడాదిగా టీమిండియా జట్టులోకి రాలేకపోయాడు.
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని టీమిండియా సెలక్షన్ కమిటీ అప్పటి నుంచి అతడిని జట్టులోకి తీసుకోలేదు. అయితే, ఈ విషయంలో షమీ వైఖరి స్పష్టంగా ఉంది. సెలక్షన్ కమిటీ గురించి ఆయన మాట్లాడుతూ.. “నా చేతుల్లో ఉన్నదాన్ని మాత్రమే నేను కంట్రోల్ చేయగలను. నా తలరాతను నేను మార్చలేను” అని అన్నాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్‌కు మారిన షమీ, తాజా సీజన్‌లో ఆ జట్టులో చేరాడు. ఫ్రాంచైజీ తనపై ఉంచిన నమ్మకానికి తగ్గట్టుగా రాణిస్తానని ఈ స్టార్ బౌలర్ హామీ ఇచ్చాడు. “ఒక బౌలర్‌గా నేను నా వంద శాతం కృషి చేస్తాను. జట్టు అంచనాలకు అనుగుణంగా రాణించడానికి నేను వందకు వంద శాతం ప్రయత్నిస్తాను. నా కష్టానికి సరైన ఫలితాలు రావడం చూసి పొందే సంతృప్తే నాకు అత్యంత ముఖ్యం” అని షమీ వెల్లడించాడు. రిటైర్మెంట్ గురించి షమీ సంచలన వ్యాఖ్యలను చూసిన తర్వాత.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్లలో తనను ఒకరిగా నిలబెట్టిన క్రికెట్ పట్ల తనకు ఇప్పటికీ అదే అభిరుచి, అదే తపన ఇంకా ఉన్నాయని స్పష్టమవుతోంది.
READ ALSO: Cylinder Price Hike: ఏప్రిల్ 1న కేంద్రం షాక్.. భారీగా పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?