Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
- జీవో 84తో పోలీస్ పరిధుల పునర్వ్యవస్థీకరణ
- 76 ప్రాంతాల్లో జోన్లు, డివిజన్ల మార్పులు
- RGIA పీఎస్ పేరు ఇక శంషాబాద్ పీఎస్
- ట్రాఫిక్, ఉమెన్ సేఫ్టీ, సైబర్ వింగ్లకూ కొత్త పరిధులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad City : హైదరాబాద్ మహానగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, పోలీసు వ్యవస్థ పనితీరును మరింత సమర్థవంతంగా మార్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలో భారీగా పునర్వ్యవస్థీకరణ చేపడుతూ హోంశాఖ జీవో ఎంఎస్ నంబర్ 84 (G.O.Ms.No.84) ద్వారా అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ ఉత్తర్వుల ప్రకారం సిటీ పోలీస్ పరిధిలోని పలు జోన్లు, డివిజన్లు , పోలీస్ స్టేషన్ల సరిహద్దులను సవరించారు. మహానగర విస్తరణ, జనాభా పెరుగుదలకు అనుగుణంగా పరిపాలనా సౌలభ్యం , శాంతిభద్రతల పర్యవేక్షణను సులభతరం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
76 ప్రాంతాల పరిధుల్లో మార్పులు.. ఆర్జీఐఏ పీఎస్ పేరు మార్పు
నగర వ్యాప్తంగా మొత్తం 76 ప్రాంతాలకు సంబంధించి పోలీసు పరిధులను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఇందులో భాగంగా కొన్ని పోలీస్ స్టేషన్ల పరిధులను ఇతర జోన్లు , డివిజన్లకు బదిలీ చేశారు. సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలను మల్కాజిగిరి కమిషనరేట్‌కు బదిలీ చేయగా, మహేశ్వరం, శంషాబాద్, సైబరాబాద్ పరిధుల్లోనూ కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. శంషాబాద్ డివిజన్లోని ఆర్జీఐఏ (RGIA) పోలీస్ స్టేషన్ పేరును ‘శంషాబాద్ పీఎస్’గా మారుస్తూ పునర్వ్యవస్థీకరించారు. వీటితో పాటు రాజేంద్రనగర్, అబ్దుల్లాపూర్‌మెట్, మీర్పేట్ పోలీస్ స్టేషన్ల పరిధులతో పాటు విఐపి ప్రాంతాలైన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సనత్‌నగర్ ప్రాంతాల్లోని పోలీసు సరిహద్దులను కూడా పునర్విభజించారు.
Also Read
- Smuggling Racket: విజయవాడ కేంద్రంగా బంగారం స్మగ్లింగ్.. అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
- Police Martyrs' Day 2026: పోలీసు అమరవీరుల సంస్మరణ దినం 2026.. పోలీసు కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా
- CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
- MVSR College : దాండియా వేడుకలో ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. ముగ్గురు అరెస్ట్
ట్రాఫిక్, ఉమెన్ సేఫ్టీ, సైబర్ వింగ్‌ల పరిధుల పునర్విభజన
కేవలం లా అండ్ ఆర్డర్ పీఎస్లకే పరిమితం కాకుండా ప్రత్యేక విభాగాలు, వింగ్లలోనూ ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. నగరంలో ట్రాఫిక్ నిర్వహణను మరింత క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ పోలీసు పరిధిలోని జోన్లు, డివిజన్లను సరికొత్తగా వర్గీకరించారు. మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ ఉమెన్ సేఫ్టీ వింగ్ (Women Safety Wing) పరిధిలో కొత్తగా జోన్లను కేటాయించారు. పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు, బాధితులకు వేగంగా న్యాయం అందించేందుకు వీలుగా జోనల్ సైబర్ సెల్ (Zonal Cyber Cell) పరిధులను కూడా పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం జీవోలో స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నూతన సరిహద్దుల అమలుతో పౌరులకు పోలీసు సేవలు మరింత సులువుగా, వేగంగా అందనున్నాయి.
తాజావార్తలు
-
Smuggling Racket: విజయవాడ కేంద్రంగా బంగారం స్మగ్లింగ్.. అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
-
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీకి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కష్టమేనా? శ్రేయస్ అయ్యర్ ఏమన్నారంటే
-
Explainer: ఆలస్యంగా నిద్రపోతున్నారా?
-
Marco Rubio: భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌తో అమెరికా సంబంధాలుండవు.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
-
AP SEC Meeting: సుప్రీంకోర్టు ఆదేశాలతో అలర్ట్.. ఎస్ఈసీ అత్యసర సమావేశం..!
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!