Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలో తీవ్ర విషాదం
- దివేగర్ బీచ్‌లో 8 మంది విద్యార్థులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Tragedy: మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలోని దివేగర్ బీచ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పూణేలోని అలందీకి చెందిన ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌కు చెందిన విద్యార్థులు గురువారం విహారయాత్రకు వెళ్లారు. సముద్రంలో ఈతకు దిగి 8 మంది విద్యార్థులు నీటిలో కొట్టుకుపోయారు. ఈ టూర్‌కు మొత్తం 48 మంది టీమ్ వెళ్లింది. ఇందులో 25 మంది బాలురు, 17 మంది బాలికలు ఉన్నారు. వీరంతా పూణేలోని విన్నర్ అకాడమీలో 11,12 తరగతులకు కోచింగ్ తీసుకుంటున్నారు. చనిపోయిన వారు 16 ఏళ్ల వారని అధికారులు చెప్పారు.
విద్యార్థులు దివేగర్ లోని దిఘి సాగరి ప్రాంతానికి చేరుకున్న తర్వాత బీచ్‌లో ఈతకు దిగారు. ఆ సమయంలో అలలు, ప్రవాహం బలంగా ఉండటంతో 8 మంది సముద్రంలో కొట్టుకుపోయింది. నీటి లోతు, ప్రవాహ తీవ్రతను అంచనా వేయలేకపోవడంతో పెను విషాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు కొట్టుకుపోయిన వెంటనే స్థానికులు, పోలీసులు రెస్క్యూ చర్యలు ప్రారంభించారు.
Also Read
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
- Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
చాలాసేపటి తర్వాత 8 మంది మృతదేహాలను ఒడ్డుకు తీసుకువచ్చారు. మృతుల్లో తన్మయ్ దత్తాత్రయ్ వహిలే, సుమిత్ భారత్ అహిరే, ప్రణవ్ రామ్‌దాస్ బన్సోడే, కైవల్య సతీశ్ వాసంకర్, రాజ్వీర్ యువరాజ్ వహిలే, యశ్ కిరణ్ వాంఖడే, సోహమ్ తుకారాం భాండ్వల్కర్, కౌస్తుభ్ సందీప్ దౌండ్ ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.
తాజావార్తలు
-
Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
-
OTR: ఉమ్మడి నల్గొండలో రెడ్డి ఆధిపత్యం? కాంగ్రెస్‌లో బీసీ నేతల అసంతృప్తి!
-
Common Pass : హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీకి ఒకే పాస్
-
Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
-
Flydubai Attack: విమానాన్ని కూల్చాలనుకున్న ఒమన్ పైలట్.. ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?