Allu Arjun : ఐకాన్ స్టార్ బర్త్ డే.. ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ చెప్పిన బన్నీ వాసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు (ఏప్రిల్ 8) అంటే అభిమానులకు ఒక పండగ లాంటిది. ప్రతి ఏటా బన్నీ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుండి ఏదో ఒక భారీ అప్‌డేట్ వస్తుందని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా టీజర్ లేదా గ్లింప్స్ వంటి విజువల్ ట్రీట్ కోసం సోషల్ మీడియాలో భారీ అంచనాలు ఉంటాయి. అయితే ఈసారి అభిమానులకు కాసింత నిరాశ తప్పదనే చెప్పాలి.
బన్నీ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. బన్నీ కెరీర్ లో 22వ సినిమాగా వస్తున్న ఈ చిత్రానికి సంబంధించి బన్నీ బర్త్ డే కు గ్లిమ్స్ ఉంటుందేమోనని ఫ్యాన్స్ ఎదురుస్తున్న తరుణంలో ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ AA 22 అప్‌డేట్స్‌పై క్లారిటీ ఇచ్చారు. వాసు మాట్లాడుతూ ‘బన్నీ పుట్టినరోజున ఎలాంటి వీడియో కంటెంట్ విడుదల చేసే ఆలోచన చిత్ర యూనిట్‌కు లేదు, నాకు తెలిసినంత వరకు ఈ పుట్టినరోజుకు కేవలం సినిమా టైటిల్ మరియు ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే వస్తాయి. ఎటువంటి విజువల్ కంటెంట్ లేదా వీడియో గ్లింప్స్ విడుదల కావడం లేదు” అని అన్నాడు. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లోనే చాలా ప్రత్యేకమైనది కావడంతో, చిత్ర బృందం అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఇప్పుడే విజువల్స్‌ను రివీల్ చేయడం వల్ల సినిమాపై ఉన్న ఉత్కంఠ తగ్గిపోతుందని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే, ప్రస్తుతానికి కేవలం పోస్టర్ ద్వారానే హైప్ క్రియేట్ చేయాలని, విజువల్స్ కోసం మరికొంత కాలం వేచి చూడాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. వీడియో ఆశించిన అభిమానులకు ఇది కొంత నిరాశ కలిగించే విషయమే అయినప్పటికీ టైటిల్ మరియు పోస్టర్ లోడింగ్ అనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Also Read
- Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
- Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
- Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
తాజావార్తలు
-
Tollywood Stars : ఆరోగ్యాన్ని పక్కన పెట్టి షూటింగ్స్‌కు పరుగులు ఎందుకు?
-
Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
-
The Paradise: ప్యారడైజ్‌కు ప్యాకప్.. ఇక థియేటర్లలో నాని మాస్ రచ్చే!
-
CNR Rao: భారతరత్న శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్. రావుకు ఎస్ఐఆర్ నోటీసు.. కారణం ఇదే!
-
Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్‌తో డార్లింగ్ ఫ్యాన్స్‌లో టెన్షన్!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!