ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ODI World Cup 2027 Schedule: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ సమరానికి నగారా మోగింది. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న మెగా టోర్నమెంట్ పూర్తి షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధికారికంగా విడుదల చేసింది. అక్టోబర్ 7వ తేదీన కేప్‌టౌన్ మైదానంలో జరిగే హై-వోల్టేజ్ బ్లాక్‌బస్టర్ మ్యాచ్‌తో టోర్నీ స్టార్ట్ కానుంది. ఆరంభ మ్యాచ్‌లోనే భారత్, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తేల్చుకోనుండటం టోర్నీపై అంచనాలను అమాంతం పెంచేసింది.
అక్టోబర్ 10న దాయాదుల పోరు.. షెడ్యూల్ పక్కా!
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆసక్తిగా చూసే భారత్ – పాకిస్థాన్ మ్యాచ్‌కు ముహూర్తం ఖరారైంది. టోర్నీ ప్రారంభమైన మూడు రోజులకే, అంటే అక్టోబర్ 10న చిరకాల ప్రత్యర్థుల సమరం జరగనుంది. రౌండ్ రాబిన్ ఫార్మాట్లో సాగే గ్రూప్ దశలో భారత్ మొత్తం ఐదు లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది:
Also Read
- Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
- ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
- India vs Pakistan: "అసలు మజా అప్పుడే".. దాయాదుల మధ్య పసిడి పోరు..
- Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
* అక్టోబర్ 7: భారత్ vs ఆస్ట్రేలియా (కేప్‌టౌన్)
* అక్టోబర్ 10: భారత్ vs పాకిస్థాన్
* అక్టోబర్ 14: భారత్ vs అఫ్గానిస్థాన్
* అక్టోబర్ 17: భారత్ vs క్వాలిఫయర్-ఎ
* అక్టోబర్ 24: భారత్ vs జింబాబ్వే
రౌండ్ రాబిన్ నుంచి సూపర్-7 దాకా.. ఫైనల్ ఎప్పుడంటే?
టోర్నమెంట్ ఆరంభం నుంచి అక్టోబర్ 24 వరకు రౌండ్ రాబిన్ పద్ధతిలో మొత్తం 30 గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ తర్వాత అసలైన వేట మొదలవుతుంది. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 14 వరకు ‘సూపర్-7’ దశలో మొత్తం 21 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. టోర్నీ ముగింపు దశకు వస్తే.. నవంబర్ 17న మొదటి సెమీఫైనల్, నవంబర్ 18న రెండో సెమీఫైనల్ జరగనున్నాయి. ఇక విశ్వవిజేత ఎవరో తేల్చే మహా పోరు నవంబర్ 21న జొహన్నెస్‌బర్గ్ వేదికగా జరగనుంది. తొలి మ్యాచ్‌లోనే బలమైన కంగారూలతో తలపడుతూ, ఆ వెంటనే దాయాది పాక్‌ను ఢీకొట్టేలా టీమిండియా షెడ్యూల్ ఖరారవ్వడంతో క్రీడాభిమానుల్లో ఉత్కంఠ తారస్థాయికి చేరింది.
తాజావార్తలు
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?