Swag : శ్రీ విష్ణు హీరోగా ఇటీవల కాలంలో వరుస హిట్లను అందుకున్నాడు. తాజాగా రాజరాజ చోర అనే సినిమా చేసిన హాసిత్ గోలి దర్శకత్వంలో స్వాగ్ అచ్చ తెలుగు సినిమా అంటూ మరో సినిమా చేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద విశ్వప్రసాద్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది. ఆసక్తికరంగా రీతు వర్మ, మీరాజాస్మిన్ సహా ఈ సినిమాలో దక్ష నగార్కర్ నటించారు. ప్రమోషన్స్ తో ఒక్కసారిగా ఈ సినిమా యూనిట్ సినిమా మీద ఆసక్తి పెరిగేలా చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు హసిత్ గోలి.. వినూత్నమైన కాన్సెప్ట్‌తో రూపొందించారు. ఇక ఈ సినిమాలో శ్రీ విష్ణు చేసిన పాత్రలు, ఆయన వేసిన గెటప్స్ జనాలను ఆకట్టుకున్నాయి.
Read Also:Amaran : ‘హే రంగులే’ అంటూ సాంగేసుకున్న శివకార్తికేయన్, సాయి పల్లవి
అయితే, ఈ సినిమాలో హీరో శ్రీ విష్ణు ఓ సర్‌ప్రైజింగ్ పాత్రలో కనిపిస్తారని మేకర్స్ రిలీజ్‌కి ముందే క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆ పాత్ర ఏమై ఉంటుందా అని సినిమా విడుదల అయ్యే వరకు అందరూ ఆసక్తిగా చూశారు. అయితే, తాజాగా ఈ పాత్రను మేకర్స్ అఫీషియల్‌గా రివీల్ చేశారు. ఈ సినిమాలో ‘విభూతి’ అనే పాత్రలో శ్రీ విష్ణు కనిపించాడని, ఈ పాత్రను ఆడియెన్స్ అమితంగా ఇష్టపడుతున్నారని వారు పేర్కొన్నారు. ఇలా లేడీ గెటప్‌లో హీరో శ్రీ విష్ణుని చూసి ఆడియెన్స్ థ్రిల్ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో శరణ్య ప్రదీప్, గెటప్ శ్రీను, కమెడీయన్ సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
Read Also:Off The Record: కొవ్వూరులో పేకాట క్లబ్బులపై పోలీస్ వార్ డిక్లేర్..కారణం ఏంటి ?
Vibuthi is one the most special roles I’ve ever done and extremely grateful to the entire audience for making it very special with all your Love & Support ❤️#Swag #SwagTheFilm pic.twitter.com/DNHjLy0XI0
— Sree Vishnu (@sreevishnuoffl) October 7, 2024