KTR: మూసీపై కబ్జాలను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపైన కేటీఆర్ విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరం కోసం ప్రత్యేకంగా చేస్తున్న అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలపైన ఈ మీటింగ్ లో సీఎం కేసీఆర్ కు నగర ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సర్కార్.. హైదరాబాద్ నగరంలో వరద నివారణ కోసం చేపట్టిన ఎస్ఎన్ డీపీ కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చిందని, గతంలో కురిసిన భారీ వర్షాలకు వరద చేరి మునిగిపోయిన అనేక ప్రాంతాలు, ఈ సంవత్సరం భారీగా వర్షాలు కురిసినా వరద ప్రమాదం నుంచి తప్పించుకున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎస్ఎన్ డీపీ కార్యక్రమంతో పాటు మూసీ నదిని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని కార్యక్రమాలకు ప్రభుత్వానికి అండగా ఉంటామని ఎమ్మెల్యేలుగా ఈ సందర్భంగా తెలిపారు.
Read Also: Josh Ravi: అవకాశాలు రాకపోతే ఆ పనైనా చేస్తాను కానీ, జబర్దస్త్ కు మాత్రం వెళ్లను
Also Read
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో 10 వేలకు పైగా ఇండ్లను మూసీ నది ఒడ్డున దుర్భర పరిస్ధితుల్లో నివసిస్తున్న పేద ప్రజలకు అందించి, మూసీపైన కబ్జాలను తొలగించేలా ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కి ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా కోరారు. హైదరాబాద్ నగరంలో వరద నివారణ కోసం చేస్తున్న కార్యక్రమాలకు మద్దతుగా స్వయంగా ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ఈ ప్రతిపాదనపైన మంత్రి కేటీఆర్ అభినందించారు. ఇందులో భాగంగా ఇప్పటికే గుర్తించిన మూసీ నదిలో నివాసం ఉంటున్న పేద ప్రజలను, అక్కడి ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి తప్పించి సురక్షిత ప్రాంతాలకు తరలించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయిస్తుందని తెలిపారు.
Read Also: Guntur Kaaram: హమ్మయ్య.. మహేశ్ మూవీకి డీవోపీ దొరికాడు
మూసీ వరద నుంచి పేద ప్రజలను, నగరాన్ని కాపాడే ఉదాత్తమైన ప్రభుత్వ కార్యక్రమానికి ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలే స్వయంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటామని తెలపడం పట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కబ్జాలను అడ్డంకులను తొలగిస్తే భవిష్యత్తులో మూసి పరివాహక ప్రాంతాలకు వరద ప్రమాదం తగ్గుతుందన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. ఎస్ఎన్ డి పి రెండవ దశ కార్యక్రమానికి సంబందించిన పనులను త్వరలోనే మంజూరీ చేస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో వాననీటి నిర్వహణ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతదన్నారు.
Read Also: Vespa: ‘వెస్పా’ కొత్త మోడల్… ధర వింటే దిమ్మ తిరగాల్సిందే
ఇప్పటికే ప్రకటించిన విధంగా వచ్చే వారంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుందని తెలిపిన కేటీఆర్, ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో గుర్తించిన లబ్ధిదారులకి ఇల్లు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఉన్నచోటనే నిర్వహిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేలకు తెలియజేశారు. హైదరాబాద్ నగరంలో గత పది సంవత్సరాలలో జరిగిన విస్తృతమైన అభివృద్ధి పట్ల ప్రజలు అత్యంత సంతృప్తిగా ఉన్నారన్న నివేదికలును తమకు ఉన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. తమ నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లి, రానున్న ఎన్నికల్లో ప్రజల మద్దతు అడగాలని ఈ సందర్భంగా కేటీఆర్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు