Vespa: ‘వెస్పా’ కొత్త మోడల్… ధర వింటే దిమ్మ తిరగాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JUSTIN BIEBER X VESPA: వెస్పా.. స్కూటీలలో దీనికి ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. దీనికి ఉండే లుక్ ఇది ఇచ్చే కంఫర్ట్ నెక్స్ట్ లెవల్ అని చెప్పొచ్చు. అందుకే అమ్మాయిలు ఇదంటే పడి చచ్చిపోతుంటారు. అబ్బాయిలకు బులెట్ బండి అంటే ఎలా పిచ్చి ఉంటుందో అమ్మాయిలకు కూడా వెస్పా అంటే కూడా అలానే ఉంటుంది. దీని స్మూత్ డ్రైవింగ్ అందరికి భలే నచ్చుతుంది. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ పియాజియో సంస్థ వీటిని తయారు చేస్తుంది. ఇది ఇటలీకి చెందిన అతిపెద్ద ఆటోమొబైల్ సంస్థ. అయితే ఈ కంపెనీ తాజాగా కొత్త మోడల్ ను ఇండియన్ మార్కెట్ లోకి తెచ్చింది. ‘జస్టిన్ బీబర్ ఎక్స్ ఎడిషన్’ పేరుతో దీన్ని లాంచ్ చేసింది పియాజియో సంస్థ . దీని ధర తెలిస్తే సామాన్యులు మాత్రమే కచ్ఛితంగా అవక్కవుతారు. ఆ ధరతో ఓ చిన్నసైజ్ కారు కూడా కొనుక్కోవచ్చు. ఇంతకీ ‘జస్టిన్ బీబర్ ఎక్స్ ఎడిషన్’ ధర ఎంతా అనుకుంటున్నారా? దాని ధర ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ. 6.45 లక్షలు అంట.
Also Read:Flags: నిజమైన దేశభక్తి అంటే ఇది… శభాష్ రా బుడ్డోడా
Also Read
- Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
- Arnab Cyclone Alert: బీభత్సం సృష్టిస్తోన్న అర్నబ్ తుఫాన్.. తీరం దాటేది ఇక్కడే..!
- Pak Vs SL: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. ఫైనల్‌కు చేరుకున్న శ్రీలంక..
- Story Board: లిక్విడ్ క్యాష్ గగనమైపోయిందా..? ప్లాస్టిక్ కరెన్సీకి, నగదు కొరతకూ లింక్ ఉందా..?
అయితే దీనికి ఇంత ధర ఉండటానికి కారణంగా దీనికి ఉండే స్పెషల్ ఫీచర్స్ అంట. దీనిని కెనడా పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ఆలోచనలకు అనుగుణంగా డిజైన్ చేసినట్లు కంపెనీ వెల్లడించింది. బీబర్ అంటే తెలియని వారుండరు, అతని పాటలకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లలో ఫ్యాన్స్ ఉన్నారు. అయితే దీని కోసం బీబర్ తో పియాజియో సంస్థ అగ్రిమెంట్ చేసుకుందని సమాచారం. ఇది పరిమిత ఎడిషన్ అని లిమిటెడ్ సంఖ్యలో మాత్రమే ఈ స్కూటీలను విక్రయిస్తామని సంస్థ తెలిపింది. అందుకే వీటికి ఇంత ధరను నిర్ణయించింది.
ఇక స్కూటీ ఫీచర్స్ విషయానికి వస్తే వెస్పా కొత్త మోడల్ స్కూటీ 150 సీసీ ఇంజిన్ కలిగి ఉంటుంది. 8 లీటర్ల ఫ్యూయల్ కెపాసిటీ ట్యాంక్ కూడా ఉంది. ఇక మిగిలినవన్నీ కడా వెస్పా గత మోడల్ లో ఉన్న ఫీచర్స్ మాదిరే ఉన్నాయి. స్కూటీ కొంటే దానితో పాటు ఒక బ్యాగ్, హెల్మెట్, హ్యాండ్ గ్లౌజ్ లు అందిస్తున్నారు. ఇక ఈ స్కూటీని ఆన్ లైన్ లో ప్రీ బుకింగ్ చేసుకోవాలి. లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి కావాలనుకున్న వారు త్వరగా బుక్ చేసుకుంటే దీనిని పొందే అవకాశం ఉంటుంది.
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!