Manoj Paramahamsa joins Guntur Kaaram crew: సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. కథలో మార్పులు మొదలు, మహేష్ ఇంట విషాదాలతో షూటింగ్ క్యాన్సిల్ అయి షెడ్యూల్స్ వాయిదా పడటం, హీరోయిన్లు మారడం, టెక్నీషియన్లు తప్పుకోవడం వంటివి పెద్ద తలనొప్పిగా మారాయి. ఈమధ్య కాలంలో ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ ను మారుస్తున్నారనే వార్తలు రాగా ఆ వార్తలను నిజం చేస్తూ కొత్త డీవోపీగా మనోజ్ పరమహంస తాజాగా టీమ్ లో జాయిన్ అయ్యారని తెలుస్తోంది. నిజానికి ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు మధీ ఈ సినిమా సినిమాటోగ్రఫర్ అని మేకర్స్ ప్రకటించినా సెట్స్ మీదకు వెళ్లే సమయానికి పీఎస్ వినోద్ వచ్చి చేరాడు. అయితే కొంతభాగం షూటింగ్ జరిగిన తర్వాత డీఓపీని మార్చబోతున్నట్లు పుకార్లు వినిపించగా ఆయన తప్పుకున్నారో లేక వీరే వద్దన్నారో తెలియదు కానీ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా వచ్చిన ‘గుంటూరు కారం’ స్పెషల్ పోస్టర్ లో వినోద్ పేరు మిస్ అవడంతో సినిమాటోగ్రాఫర్ మార్పుపై అందరికీ క్లారిటీ వచ్చింది.
Renu Desai: అలా చేయద్దు అనడానికి నువ్వెవరు?.. రేణు దేశాయ్ మరో సంచలనం
అయితే ఎవరిని తెచ్చి దించుతారా అని ఎదురుచూస్తున్న తరుణంలో, ఫైనల్ గా మనోజ్ పరమహంసను అంగంలోకి దించారు. మహేష్ బాబు ఇటీవల లండన్ వెకేషన్ ను పూర్తి చేసుకొని ఇండియా తిరిగొచ్చిన నేపథ్యంలో నిన్న హైదరాబాద్ లో ‘గుంటూరు కారం’ కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించగా మనోజ్ పరమహంస నేతృత్వంలోనే ఈ షూటింగ్ జరుగుతున్నట్లు టాక్. మనోజ్ పరమహంస ‘ఏమాయ చేసావే’ చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత కూడా ‘రేసుగుర్రం’ ‘కిక్ 2’ ‘బ్రూస్ లీ’ ‘రాధేశ్యామ్’ ‘బీస్ట్’ ‘ప్రిన్స్’ వంటి సినిమాలకు పని చేశారు. ఇక ఇప్పుడు విజయ్ – లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘లియో’ సినిమాకి వర్క్ చేస్తున్న ఆయన ఇప్పటివరకు మహేష్ తో కానీ- త్రివిక్రమ్ తో కానీ కలిసి పని చేయలేదు. మరి చూడాలి ఆయన అయినా సినిమా పూర్తి చేస్తాడో లేదో అనేది.