ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. యడ్లపాడు మండలం పాత సొలసలో తండ్రి చనిపోయి మూడు రోజులైనా.. మృతదేహానికి కుమారులు అంత్యక్రియలు చేయలేదు. ఆస్తి పంపకాల నేపథ్యంలో కుమారులు, కుమార్తెల మధ్య తలెత్తిన వివాదం తలెత్తడంతో.. తండ్రి మృతదేహం ఇంటిముందే ఉంది. వర్షం వచ్చినా, ఎండా కొడుతున్నా కూడా మృతదేహం పాడె మీద అలానే ఉంది. అయినా కూడా కన్నబిడ్డల హృదయం కరగలేదు. ఈ ఘటనతో బంధువులు, గ్రామస్తులు వారిపై మండిపడుతున్నారు.
Also Read: Mohsin Naqvi-BCCI: బీసీసీఐ హెచ్చరిక ఇ-మెయిల్.. మొహ్సిన్ నఖ్వీ కీలక ప్రకటన!
పాత సొలసలో గువ్వల పెద్ద ఆంజనేయులు (80) మూడు రోజుల కిందట అనారోగ్యంతో మృతి చెందారు. ఆస్తి పంపకాల నేపథ్యంలో కుమారులు, కుమార్తెల మధ్య వివాదం తెలెత్తింది. దాంతో దహన సంస్కారాలు నిర్వహించేందుకు ఇద్దరు కుమారులు నిరాకరించారు. మూడు రోజుల పాటు ఇంటి ముందే ఆంజనేయులు మృతదేహం ఉంది. బంధువులు, గ్రామస్తులు ఎంత చెప్పినా వారు వినలేదు. దహన సంస్కారాలు అయ్యాక మాట్లాడుకుందాం అని చెప్పినా ససేమిరా అన్నారు. విషయం తెలిసిన పోలీసులు ఆంజనేయులు మృతదేహం వద్దకు వచ్చారు. పోలీసుల జోక్యంతో కుటుంబ సభ్యులు ఆంజనేయులుకు అంత్యక్రియలు నిర్వహించారు.