Site icon NTV Telugu

Sonia Gandhi: ఇజ్రాయెల్- ఇరాన్ ఉద్రిక్తతపై స్పందించిన సోనియా గాంధీ..

Sonia Gandhi

Sonia Gandhi

ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని ఆమె ఖండించారు. మోడీ ప్రభుత్వ వైఖరిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ విషయంలో భారత్ మౌనం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఇది గొంతు కోల్పోవడం కాదు.. విలువల సర్పణ” అని ఆమె పేర్కొన్నారు. భారత్ చారిత్రక నైతిక స్థైర్యాన్ని కోల్పోయిందని.. మానవ హక్కుల ఉల్లంఘనలపై మౌనం బాధాకరమన్నారు. అంతర్జాతీయ మానవతా బాధ్యతను గుర్తు చేశారు. ఈ మేరకు సోనియా గాంధీ ఓ వ్యాసం రాశారు. దాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పంచుకున్నారు. ఇరాన్ భారతదేశానికి మిత్ర దేశమని, ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎల్లప్పుడూ బాగానే ఉన్నాయని సోనియా గాంధీ ఆ వ్యాసంలో పేర్కొన్నారు. ఇరాన్- భారత్ మధ్య స్నేహానికి ఉదాహరణగా.. 1994 నాటి జమ్మూ కశ్మీర్ సమస్యను గుర్తు చేశారు. 1994లో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్‌లో కశ్మీర్ అంశంపై భారతదేశాన్ని విమర్శించే తీర్మానాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఈ తీర్మానాన్ని నిరోధించడంలో ఇరాన్ సహాయపడిందన్నారు.

READ MORE: Nitish Kumar: అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం నితీశ్ కుమార్ కీలక నిర్ణయం.. ట్రిపులైన పెన్షన్లు!

గత కొన్ని దశాబ్దాలుగా భారత్- ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక సంబంధాలు బలపడుతున్నాయని సోనియా గాంధీ పేర్కొన్నారు. ఈ ప్రత్యేక పరిస్థితిలో.. శాంతి, సంభాషణల వారధిగా మారడానికి భారతదేశానికి దౌత్య శక్తి, నైతిక బాధ్యత ఉందని ఆమె అన్నారు. ఇది కేవలం ఒక వియుక్త సూత్రం కాదని, పశ్చిమాసియా దేశాలలో నివసిస్తున్న.. పౌరులందరి భద్రతకు సంబంధించిన విషయం అని స్పష్టం చేశారు. వారి భద్రతను తీవ్రంగా పరిగణించి, ప్రభుత్వం విదేశీ దౌత్యంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని కోరారు.

READ MORE: Krithi Shetty : టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పిన కృతి శెట్టి..?

2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ జరిపిన దాడిని సోనియా గాంధీ ఖండించారు. హమాస్ పై ఇజ్రాయెల్ జరిపిన ప్రతీకారం.. భయంకరమైనదిగా, అసమానమైనదిగా అభివర్ణించారు. ఈ దాడిలో ఎన్నో ఇళ్ళు, కుటుంబాలు, ఆసుపత్రులు నాశనమయ్యాయని.. 55,000 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఇంత భయంకరమైన దాడిని చూసి కూడా భారత్ మౌనంగా ఉండట కూడదన్నారు. ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధంలో భారత్‌ కల్పించుకోకపోవడాన్ని ఆమె విలువ లొంగుబాటుగా ఉన్నదని విమర్శించారు. ఈ విషయంలో భారత్‌ వైఖరి స్పష్టంగా ఉండాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడానికి, అందుబాటులో ఉన్న అన్ని దౌత్య మార్గాలను అనుసరించాలని ఆమె సూచించారు.

Exit mobile version