‘ఉప్పెన’ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఉప్పెనలా దూసుకొచ్చింది కృతి శెట్టి. మొదటి చిత్రంతోనే తన అందంతో ఆకట్టుకున్నా ఈ ముద్దుగుమ్మ.. బ్యాక్ టూ బ్యాక్, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుని, తక్కువ టైమ్‌లో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత ఆమె కెరీర్ ఊహించని విధంగా డౌన్ ట్రాక్‌కి వెళ్లిపోయింది. మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మనమే వంటి సినిమాలు వరుస ఫ్లాప్‌లు పడ్డాయి. దీంతో తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి.
Also Read : Shivathmika : సినిమా ఛాన్స్‌లు రావాలంటే అది తప్పనిసరి..
కానీ ప్రజంట్ ‘జస్ట్ ఫర్ ఛేంజ్’ అంటూ మలయాళ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది కృతి ఇటు కోలీవుడ్‌పై కూడా ఫుల్ ఫోకస్ పెట్టింది. కానీ ఆమె తమిళ్ ఎంట్రీ మాత్రం ఆలస్యం అవుతూనే ఉంది. కార్తీతో చేసిన ‘వా వాతియార్’ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సింది కానీ అవ్వలేదు.ఇక మరో తమిళ సినిమా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ తో సెప్టెంబర్ 18న తెరపైకి రాబోతుంది బేబమ్మ. దీంతో పాటు ‘జీని’ అనే మరో తమిళ చిత్రం కూడా చేస్తోంది.
తాజా బజ్ ప్రకారం.. ఆమె ఖాతాలో మరో భారీ క్రేజీ ప్రాజెక్ట్ చేరినట్లు సమాచారం. పృథ్వీరాజ్ సుకుమార్ రూపొందిస్తున్న ‘ఖలీఫా’ సినిమాలో కృతికి అవకాశం దక్కిందట. ఈ చిత్రం 2022లోనే అనౌన్స్ అయినప్పటికీ, వదరరాజ్ మన్నార్ ఇతర కమిట్మెంట్స్ కారణంగా డిలే అయింది. ఇప్పుడు మాత్రం జూలై నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుందని, ఇండియా, యూకే, దుబాయ్, నేపాల్‌ల్లో షూట్ జరగనున్నట్లు టాక్. ఇఖ ఈ లైన్ అప్ చూస్తే కృతి టాలీవుడ్‌ను వదిలేసిందా..? ప్రస్తుతం బేబమ్మ ఏ ప్లాన్‌తో ఉందన్నది ఆమె తదుపరి సినిమా పై ఆధారపడి ఉంది.