Congress Meeting: మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి.. నేతలతో సోనియా గాంధీ సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మినహాయిస్తే.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. ఈ క్రమంలో సోనియా గాంధీ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. జనపథ్ నివాసంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీలో మూడు రాష్ట్రాల్లో పేలవమైన పనితీరుపై చర్చిస్తున్నారు. అంతేకాకుండా.. పార్లమెంట్లో కాంగ్రెస్ వ్యూహంపై చర్చ, తెలంగాణలో సీఎంను ఎంపిక చేసే అంశంపై చర్చించే అవకాశముంది. ఈ సమావేశంలో సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఎంపీ గౌరవ్ గొగోయ్, నాసిర్ హుస్సేన్, మాణికం ఠాగూర్, ప్రమోద్ తివారీ, అభిషేక్ మను సింఘ్వీ, ఎంపీ మనీష్ తివారీ, పీ చిదంబరం, రజనీ పాటిల్, కేసీ వేణుగోపాల్, ఎంపీ శశిథరూర్, రవనీతి బిట్టు, జైరాం రమేశ్, రణదీప్ సూర్జేవాలా పాల్గొన్నారు.
Read Also: Tripti Dimri: మార్కెట్ లోకి కొత్త క్రష్ వచ్చింది మావో..
Also Read
ఇదిలా ఉంటే.. ఈసారి కూడా.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఓటమి చెందగా.. ఇంతకుముందు కాంగ్రెస్ కు కంచుకోటలా ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పటుకాలేకపోయింది. ఈ ఫలితాలు వెలువడిన మరుసటి రోజే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో సోనియా గాంధీ ఇంట్లో కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో సోనియాగాంధీ రాష్ట్ర ఎన్నికల బాధ్యతలు అప్పగించిన నేతలతో మాట్లాడతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుండా.. ఇండియా కూటమి సమావేశం గురించి చర్చించే అవకాశముంది. కాగా.. డిసెంబర్ 6వ తేదీన కాంగ్రెస్ కూటమి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also: Balmukund Acharya: రోడ్డుపక్కన ఉన్న నాన్ వెజ్ స్టాళ్లన్నింటినీ మూసేయండి.. బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!