Tripti Dimri: చిత్ర పరిశ్రమలో కొత్త హీరోయిన్లకు కొదువ లేదు. సక్సెస్ వచ్చేవరకు వారి గురించి ఎవరికి తెలియదు అంతే తేడా. జీవితంలో ఎవరికైనా ఒక గోల్డెన్ ఛాన్స్ వస్తుంది. ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ కు కూడా అంతే. ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా హిట్ అయితే చాలు. ప్రేక్షకులు ఆ హీరోయిన్ ను గుండెల్లో పెట్టుకుంటారు. ఇక ఆ హిట్ కోసం ఎన్నో ఏళ్ళు ఎదురుచూస్తూ ఉంటారు హీరోయిన్స్. ఇక చివరికి ఆ హిట్ దక్కితే.. తరువాత వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకెళ్ళిపోతు ఉంటారు. ఇక ఆ ఒక్క సినిమావలన పరిచయమైన హీరోయిన్స్ లో ఇప్పుడు త్రిప్తి డిమ్రి పేరు బాగా వినిపిస్తుంది. అరే ఎవరు ఈమె.. మేము ఎక్కడా వినలేదు అనుకుంటున్నారా.. యానిమల్ సినిమాలో రణబీర్ తో ఘాటు రొమాన్స్ చేసిన జోయా గుర్తుందా.. ? ఆమె అసలు పేరునే త్రిప్తి డిమ్రి.
Eagle: ఆ లుక్ ఏంటి రవన్న.. మాస్ కే బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నావే
హిందీలో లైలా మజ్ను సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. పలు సినిమాలు చేసి మెప్పించింది. అమ్మడి అందానికి హీరోయిన్ ఛాన్స్ అందుకోవాల్సినా.. పాత్ర పరంగా సందీప్ రెడ్డి.. ఈ భామ ను సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నాడు. అయితేనేం.. త్రిప్తి డిమ్రి కి వచ్చినంత పేరు రష్మికకు కూడా రాలేదు అంటే అతిశయోక్తి కాదు. రణబీర్ తో ఘాటు రొమాన్స్ చేసి ఆశ్చర్యపరిచిన ఈమె ఎవరు అని తెలుసుకోవడం మొదలుపెట్టారు అభిమానులు. ఇక ఎప్పుడైతే ఈమె గురించి తెలుసుకున్నారో.. ఆమెను కూడా అభిమానులు క్రష్ లిస్ట్ లోకి చేర్చేశారు. అవ్వడానికి హిందీ అమ్మాయి అయినా.. తెలుగు అమ్మాయిలనే కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తుంది. ఇక ఈ ఒక్క సినిమాతో అమ్మడు ఫేట్ మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ నిర్మాతలు అందరూ.. అమ్మడి చుట్టూ తిరుగుతున్నారని టాక్. ఈ చిన్నది ఒప్పుకుంటే కనుక.. ఇంకొన్ని రోజుల్లో వరుస సినిమాలను అనౌన్స్ చేయడం ఖాయమంటున్నారు. మరి ఈ భామ తెలుగును ఏ రేంజ్ లో ఊపేస్తుందో చూడాలి.