టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. సరైన హిట్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’తో బ్లాక్‌బస్టర్‌ను అందుకున్న అనంతరం వచ్చిన స్కంధ, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు మాత్రం ఆశించిన స్థాయిలో నిలవలేదు. దాంతో రామ్ పై మళ్లీ మంచి సినిమా చేయాలనే ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ నేడు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న దర్శకుడు పి. మహేశ్ బాబు ఈ సినిమాను తెరకెక్కించాడు. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించగా, రావు రమేష్, మురళీ శర్మ, రాజీవ్ కనకాలు, తులసి, సింధు తులానీ, రాహుల్ రామకృష్ణ, సత్య, వీటీ వీ గణేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
Also Read : Kajol: సినిమాలు లేకున్నా.. కాజోల్ ఇన్‌కమ్ సీక్రెట్ ఇదే !
మూవీ ప్రీమియర్స్ ఇప్పటికే చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో మంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు. “చాలా రోజుల తర్వాత రామ్ మంచి కథతో వచ్చాడు”, “ఔట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్” అంటూ మొదటి షో నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. రామ్ కెరీర్‌లో మళ్లీ టర్నింగ్ పాయింట్ కావచ్చని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ సినిమాకు సంబంధించిన హక్కుల విషయంలో కూడా పెద్ద డీల్ క్లోజ్ అయింది. సాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు భారీ మొత్తానికి దక్కించుకోగా, ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్స్‌లో మంచి హైప్ ఉన్న నేపథ్యంలో డిజిటల్, టివి హక్కుల కోసం జరిగిన ఈ గ్రాండ్ డీల్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.