MLA Sandra Venkata Veeraiah Fires On Congress Party: కాంగ్రెస్ పార్టీపై సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి వస్తే పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్తున్న కాంగ్రెస్.. అంతకుముందే అధికారంలో ఉన్నప్పుడు చిత్తశుద్ధితో ఎందుకు ఇవ్వలేదని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీయం బంజర్‌లో పోడు భూములకు పట్టాలు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు వస్తున్న తరుణంలో, తప్పుడు పద్ధతిలో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. మన్మోహన్ సింగ్, ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు వంటి వారు ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు.. పోడు సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు.
DS Chauhan: రోడ్డు ప్రమాదాల్ని తగ్గించాం.. నంబర్ ప్లేట్ లేకపోతే కఠిన చర్యలు తప్పవు
గతంలో పోడు సమస్యలను రాజకీయం కోసమో, ఎన్నికల కోసమో వాడుకున్నారని ఎమ్మెల్యే సండ్ర ఆరోపించారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. రాజకీయ స్వార్ధపరులు, అవకాశవాదులు ముందుకొచ్చి.. మంచి పనులు చేస్తున్న ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారులే కేసీఆర్‌కు శ్రీరామరక్షగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజకీయ కోణం లేకుండా, మానవీయ కోణంతోనే కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. కేవలం రాజకీయ స్వార్థం కోసమే కాంగ్రెస్ వాళ్లు రూ.4000 పెన్షన్ ఇస్తామంటున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఎన్ని రాష్ట్రాల్లో రూ.4000 పెన్షన్ ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ స్వార్థం లేకుండా.. కులం, మతం లేకుండా.. పేదరికమే గీటు రాయిగా పనిచేస్తున్న కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని ప్రజల్ని కోరారు.
Iran: నకిలీ క్లినిక్ ముసుగులో మహిళలపై అత్యాచారం.. ముగ్గురికి ఉరిశిక్ష అమలు..