మహారాష్ట్రలో ఎన్‌సీబీ సంక్షోభం నేపథ్యంలో శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు తమ బలాన్ని ప్రదర్శించడానికి కీలక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ముంబైలోని బాంద్రాలో అజిత్ పవార్ శిబిరం సమావేశం జరుగుతుండగా.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శిబిరం సమావేశం ముంబైలోని వైబీ చవాన్ సెంటర్‌లో జరుగుతోంది.
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలో జూన్ 2022 రాజకీయ సంక్షోభంపై ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం తన ఉత్తర్వును ప్రకటించింది. ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వానికి పెద్ద ఊరటనిస్తూ, ఉద్ధవ్ థాకరే బలపరీక్షను ఎదుర్కోకుండా రాజీనామా చేసినందున ఆయన ప్రభుత్వాన్ని పునరుద్ధరించమని ఆదేశించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.