Online Betting: కామారెడ్డిలో బెట్టింగ్ మోజు ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో 80 లక్షలకుపైగా కోల్పోయి అప్పుల బాధలో మునిగిపోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సంజయ్ చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. భార్య శ్రీలత కన్నీరుమున్నీరవుతూ.. అప్పుల బాధల వల్లే నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడని, బెట్టింగ్ యాప్‌లను తక్షణమే నిషేధించాలని కోరింది. అలాగే, ఎవరైనా అప్పు ఇచ్చే ముందు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలి అంటూ వాపోయింది.…