Deepfake: డీప్‌ఫేక్‌ను అడ్డుకోవాల్సిందే.. ఆ బాధ్యత సోషల్ మీడియాదే..
- డీప్ ఫేక్‌లను అడ్డుకోవాల్సిందే..
- దీనికోసం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లు ఇన్ బిల్ట్ ఆల్గారిథమ్ తీసుకురావాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deepfake: డీప్ ఫేక్‌లను అడ్డుకోడానికి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లు ఇన్ బిల్ట్ ఆల్గారిథమ్ తీసుకురావాలని.. డీప్ ఫేక్ ల వల్ల విపరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, మంచి కోసం ఉపయోగించాల్సిన ఏఐ టెక్నాలజీలను చెడు కోసం వినియోగిస్తున్నారని ప్రముఖ పాత్రికేయుడు, ఫ్యాక్ట్ చెక్ ట్రైనర్ ఉడుముల సుధాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.. హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో డేటా సైన్స్ సమిట్ కార్యక్రమంలో మాట్లాడారు. ఐపీఎస్ అధికారులు, ప్రొఫెసర్లు, ఏఐ నిపుణులు నవంబర్ 29న నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్నికల సమయంలో ప్రత్యర్థులను దెబ్బతీయడం కోసం డీప్ ఫేక్ లను ఉపయోగిస్తూ ఉన్నారని, ఏఐ ద్వారా ముఖాలను మార్చడం, సెలెబ్రిటీల వాయిస్ తో ఇతర వ్యాఖ్యలు చేసేలా ఏఐ ద్వారా సృష్టించడం జరుగుతూ ఉన్నాయన్నారు సుధాకర్ ఉడుముల. సినీ నటుల దగ్గర నుండి, రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యాపారులు, ఎవరినైనా సరే ఈ డీప్ ఫేక్ ల ద్వారా ఫేక్ వార్తలను సృష్టించడం వీలవుతుంది. ఒకప్పుడు డీప్ ఫేక్ లను గుర్తించడం కాస్త సులువుగా ఉండేది.. కానీ, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, సాఫ్ట్ వేర్ కారణంగా ఏది డీప్ ఫేక్, ఏది ఒరిజినల్ అని కనుగొనడం కష్టంగా మారిపోతోంది. ఏఐని మంచి కోసం ఉపయోగించకుండా చెడు కోసం ఉపయోగిస్తూ ఉండడమే ఈ పరిణామాలకు కారణమవుతోందన్నారు.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
Also Read
- Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
- Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
- Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
- Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
ఇక, సెలెబ్రిటీల పరువు తీయడానికి, కొందరిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో దాడులు చేయడానికి, మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఈ డీప్ ఫేక్ లను ఉపయోగిస్తూ ఉన్నారు. డేటా సైన్స్ సమ్మిట్ ను బ్రిటిష్ డిప్యూటీ కమిషనర్ గారెత్ ఓవెన్ ప్రారంభించారు. కీనోట్ స్పీకర్ గా లారా బాల్డ్విన్, దక్షిణాసియా సైబర్ లీడ్, బ్రిటిష్ హై కమిషన్ వ్యవహరించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియా నుండి మెయిన్ స్ట్రీమ్ మీడియా లోకి వచ్చేయడం కూడా ఆందోళన కలిగిస్తోంది. దీనిపై ప్రముఖ సోషల్ మీడియా సంస్థలు ఫేస్ బుక్, ఎక్స్, ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ కూడా చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోషల్ మీడియా సైట్స్ ‘ఇన్ బిల్ట్ డీప్ ఫేక్ డిటెక్షన్ అల్గారిథమ్’ ను తీసుకుని వస్తే వీటిని కట్టడి చేయడం సులభం అవుతుంది. సోషల్ మీడియా ద్వారా ఈ డీప్ ఫేక్ వీడియోలు ఎక్కువగా వ్యాపిస్తున్నాయి కాబట్టి బాధ్యత తీసుకోవాల్సింది కూడా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లదే. ఏఐ ని రెగ్యులేట్, ఎడ్యుకేట్, డిటెక్ట్ విషయంలో సమిష్టి కృషి అవసరం.
Read Also: Revanth Reddy Tweet: ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ వైరల్..
భారతదేశంలో తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకోవడం కోసం ఫ్యాక్ట్ చెకర్లు మిస్ ఇన్ఫర్మేషన్ కాంబాట్ అలయెన్స్ ను స్థాపించారు. అందులో భాగంగా డీప్ ఫేక్ అనాలసిస్ యూనిట్ ను కూడా తీసుకొచ్చారు. ఎవరికైనా డీప్ ఫేక్ మీద అనుమానాలు ఉంటే ఈ యూనిట్ కు వాట్సాప్ ద్వారా సమాచారం అందించవచ్చు. భారత్ లో ఫ్యాక్ట్ చెకింగ్ కు సరైన తోడ్పాటును అందించడం లేదు. మీడియా లిటరసీలో భాగంగా డీప్ ఫేక్ అంటే ఏమిటి, అవి ఎలాంటి ప్రమాదాలకు కారణమవుతాయి లాంటి వివరాలను అందించే కార్యక్రమాలను ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉందన్నారు.. లావోస్, కంబోడియా లాంటి దేశాల్లో కూర్చొని భారతదేశంలోని పిల్లలు కిడ్నాప్ అయ్యారు, డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కున్నారు అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. సైబర్ నేరగాళ్లు డీప్ ఫేక్ ఆడియో, వీడియోలను వాడుతూ మోసాలకు తెగబడుతూ ఉన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. డీప్ ఫేక్ లు ఎన్నో మోసాల్లో భాగమయ్యాయి, మీడియాలోకి చొచ్చుకొస్తున్నాయి. ఎన్నికల ఫలితాలను మార్చే ప్రమాదం కూడా ఉంది. డీప్ ఫేక్ లను వాడి అసభ్యకరమైన వీడియోలను కూడా సృష్టిస్తూ ఉన్నారు. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా మన వీడియోలను ఎవరైనా డీప్ ఫేక్ చేశారా అని కూడా తెలుసుకోవాల్సిన దౌర్భాగ్యం మనకు వచ్చింది. ముఖ్యంగా మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. డీప్ ఫేకింగ్ రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్రమవుతుంది. ఆర్థికంగా కూడా చాలా ఎంతో మందికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐపీఎస్ అజయ్ కుమార్ యాదవ్ కూడా డీప్ ఫేక్ కారణంగా ఎదురవుతున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఐపీఎస్ రోహిత్ మాల్పని, సైబర్ పీస్ ఫౌండేషన్ ఫౌండర్ మేజర్ వినీత్ కుమార్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సంస్థ మేనేజ్మెంట్ కూడా ఈ కార్యక్రమంలో భాగమయ్యారు.
తాజావార్తలు
-
Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
-
Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
-
Cyber Fraud: లేడీ మాయలో డాక్టర్.. ఫేస్బుక్ పరిచయంతో రూ.14.61 కోట్లు స్వాహా..!
-
OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
-
TG SAFE : ఆదేశాలు బేఖాతరు.. యథేచ్ఛగా రెస్టారెంట్లు ఓపెన్..!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?