Tollywood Directors : టాలీవుడ్ డైరెక్టర్లకు నార్త్ లో మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ఇప్పుడు తెలుగు డైరెక్టర్లు చేస్తున్న సబ్జెక్టులు నార్త్ జనాలకు బాగా నచ్చుతున్నాయి. అందుకే బాలీవుడ్ హీరోలు కూడా తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు తెలుగు డైరెక్టర్లను నార్త్ వాళ్లు పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ మన డైరెక్టర్ల సత్తా ఏంటో పాన్ ఇండియా స్థాయిలో కనపడుతోంది. ఇప్పటికే మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని సన్నీడియోల్ తో మూవీ చేసి మంచి హిట్ అందుకున్నాడు. దీంతో ఆయన మార్కెట్ బాలీవుడ్ లో కూడా పెరుగుతోంది. మరో హిట్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా బాలీవుడ్ లో సినిమా చేయాలని చూస్తున్నారు.
Read Also : BR Gavai: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా బీఆర్ గవాయ్ నియామకం
ఇప్పటికే అమీర్ ఖాన్ తో సినిమా ఓకే అయిందనే టాక్ వనిపిస్తోంది. త్వరలోనే మూవీ స్టార్ట్ కాబోతోందంట. అటు మరో హిట్ డైరెక్టర్ బాబీ హృతిక్ రోషన్ తో సినిమా చేస్తాడని సమాచారం. ప్రశాంత్ వర్మ కూడా రణ్ వీర్ సింగ్ తో సినిమా చేస్తాడని బాలీవుడ్ మీడియా చెబుతోంది. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా రణ్ బీర్ కపూర్ తో యానిమల్ మూవీ చేసి మంచి హిట్ అందుకున్నాడు. భవిష్యత్ లో అతను మరో బాలీవుడ్ హీరోతో సినిమా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా టాలీవుడ్ డైరెక్టర్లు బాలీవుడ్ బాట పట్టేసి అక్కడ కూడా సత్తా చాటుతున్నారు. ఇది మంచి పరిణామం అనే చెప్పుకోవాలి. తెలుగు ఇండస్ట్రీని దేశ వ్యాప్తంగా తీసుకెళ్లడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది.