Jasprit Bumrah: ఎట్టకేలకు టెస్టు కెప్టెన్ ఎంపికపై మౌనం వీడిన జస్‌ప్రీత్ బుమ్రా.. ఏమన్నాడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jasprit Bumrah: భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌లో కెప్టెన్‌గా ఎంపిక కాకపోవడంపై చివరికి తన మౌనాన్ని వీడారు. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ తనను కెప్టెన్సీకి ఆలోచించినప్పటికీ, తన వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కారణంగా ఆ అవకాశాన్ని తిరస్కరించాల్సి వచ్చిందని అన్నారు. టెస్టులకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత శుభ్‌మన్ గిల్ కు కెప్టెన్సీ, రిషబ్ పంత్ కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు.
Read Also: 4-Day Tests: నాలుగు రోజుల టెస్ట్‌లకు ఐసీసీ గ్రీన్ సిగ్నల్..?
Also Read
- Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
- Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
- Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
రోహిత్, విరాట్ రిటైరైన సమయం, ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే నేను బీసీసీఐని సంప్రదించాను. ఐదు టెస్ట్‌ల సిరీస్‌కి నా శరీర భారం ఎలా ఉంటుంది అనేది డాక్టర్లతో, సర్జన్స్ తో, నా ఫిజియోలాజికల్ టీమ్‌తో చర్చించాను. వాళ్లంతా నీవు చాలా తెలివిగా వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ చేయాలని ఒకే మాట చెప్పినట్లు తెలిపారు. దాంతో నేను బీసీసీఐకి కాల్ చేసి కెప్టెన్సీ భాద్యతలు తీసుకోనని చెప్పానని బుమ్రా వెల్లడించారు. నిజానికి బీసీసీఐ నన్ను లీడర్‌గా చూడాలనుకుంది.. అది నాకు గౌరవమే. కానీ ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో మూడింట్లో ఒక కెప్టెన్, రెండింట్లో ఇంకొకరు ఉంటే అది జట్టుకే నష్టం. నేను ఎప్పుడూ జట్టు ప్రయోజనాన్ని ముందుగా చూసే వ్యక్తిని. అందుకే తప్పుకున్నా అంటూ బుమ్రా పేర్కొన్నాడు.
Read Also: Parenting Advice: పాఠశాలలు ప్రారంభం.. ఈ అంశాల్లో మీ పిల్లల్ని కంట్రోల్ చేయకపోతే అంతే సంగతులు?
గత కొద్దీ కాలంగా బుమ్రా గాయాల బాధతో తరచూ మ్యాచులకు దూరమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదు టెస్ట్‌ల పూర్తి సిరీస్ ఆడటం బుమ్రా శరీరానికి సవాలుగా మారే అవకాశం ఉండటంతో బీసీసీఐ ఇప్పటికే నిర్ణయం తీసుకుని, ఆయనను అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉంచకుండా ప్లాన్ చేసింది. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు ముందు జస్‌ప్రీత్ బుమ్రా తీసుకున్న ఈ సరైన నిర్ణయం ఆయన ప్రొఫెషనలిజం, జట్టు పట్ల నిబద్ధతకు ఉదాహరణగా నిలుస్తోంది.
తాజావార్తలు
-
19th BRICS Summit in China: 19వ BRICS సమ్మిట్ చైనాలో.. అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటన
-
Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
-
Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
-
ISRO IPRC Recruitment 2026: ఇస్రోలో ఉద్యోగాలు.. 10వ తరగతి, ITI, డిప్లొమా అర్హతతో అప్లై చేయండి!
-
Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!