తిరుపతి-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ లోని ఓ బోగీలో ఒక్క సారిగా పొగలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులందరూ ఆందోళన చెందారు. అయితే ఎలాంటి ప్రమాదమూ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఎప్పటిలాగే తిరుపతి నుంచి సికింద్రబాద్ కు వస్తుంది.. సాయంత్రం ఆ ట్రైన్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మునబోలు సమీపంలోకి చేరుకుంది. ఒక్కసారిగా రైల్లో పొగలు రావడం కలకలం రేపింది.
Read Also: Kiara Adwani : హాట్ క్లివేజ్ షో తో అదరగొడుతున్న కియారా..
అయితే ట్రైన్ లోని ఓ బోగీలో ఒక్క సారిగా స్వల్పంగా మంటలు వచ్చినట్లు ప్రయాణికులు గుర్తించారు. ఆ తరువాత దట్టమైన పొగలు వ్యాపించాయి. ఇది ఆ బోగీ మొత్తం వ్యాపించింది. ఇది గమనించిన రైల్ సిబ్బంది వెంటనే లోక్ పైలట్ కు విషయం అందించారు. దీంతో అప్రమత్తమైన లోక్ పైలెట్ రైలును నిలిపివేసేందుకు సడెన్ బ్రేకులు వేసేశాడు. రైలు ఒక్క సారిగా ఆగిపోవడంతో పాటు.. ట్రైన్ లో పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
Read Also: Kurnool Road Accident: కర్నూలులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు!
అయితే, ఒక్కసారిగా ట్రైన్ ఆగిపోవడంతో వెంటనే ప్రయాణికులందరు భయంతో కిందకు దిగి పరుగులు పెట్టారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి రైలు నుంచి దూకి పారిపోతుండగా రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో అరగంటకు పైగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఆగిపోయింది. దీంతో రైల్వే అధికారులు వెంటనే మరమ్మతులు చేశారు. ఆ తర్వాత పొగలు తగ్గిపోవడంతో ట్రైన్ మళ్లీ అక్కడ నుంచి బయలుదేరింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.