గుర్తు తెలియని మహిళ పుర్రె లభ్యమైన సంఘటన మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని అత్వెల్లి గ్రామంలోని నార్నే ఎస్టేట్లో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి పుర్రె, వెంట్రుకలు, చీర, బ్లౌజ్, చేతి సంచి, ఒక చెప్పు కనపడింది. దీంతో వెంటనే స్థానిక మేడ్చల్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మేడ్చల్ సీఐ అద్దాని సత్యనారాయణ, సబ్ ఇన్స్పెక్టర్ మురళీధర్ లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
మెక్సికోలో దారుణం జరిగింది. అల్వారో అనే వ్యక్తి తన భార్యను చంపిన తర్వాత ఆమె మెదడును టాకోస్ అనే మెక్సికో ఆహారంతో కలిపి తిన్నాడనే ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ చేయబడ్డాడు. 38 ఏళ్ల అతడిని జులై 2న ప్యూబ్లోలోని అతని ఇంటి నుంచి అరెస్టు చేసినట్లు ది మిర్రర్ నివేదించింది.
హాంకాంగ్ మోడల్ అబ్బి చోయ్ (28) అత్యంత పాశవికంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఫ్రిజ్‌లో కాళ్లు కనిపించగా.. తల, మొండెం, చేతుల కోసం పోలీసులు వెతికారు. డాగ్ స్క్వాడ్, డ్రోన్లతోపాటు డ్రైనేజీలో కూడా వెతికారు.
ప్రస్తుతం అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉన్నది. ఎలాంటి జబ్బులను నయం చేయడానికైనా మందులు అందుబాటులో ఉన్నాయి. పూర్వం రోజుల్లో ఇంతటి వైద్యం అందుబాటులో లేదు. రవాణా సౌకర్యాలు అంతంత మాత్రమే. తీవ్రమైన జబ్బులు వస్తే నాటు వైద్యం చేసేవారు. లేదా ఆ జబ్బులతో బాధపడుతూ మరణించేవారు. ఇక వేల సంవత్సరాల క్రితం వైద్యం ఎలా ఉంటుంది… అసలు వైద్యం గురించి అప్పట్లో ప్రజలకు తెలుసా లేదా అంటే, 2 వేల ఏళ్ల క్రితమే అత్యాధునిక వైద్యం అందుబాటులో…