గుర్తు తెలియని మహిళ పుర్రె లభ్యమైన సంఘటన మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని అత్వెల్లి గ్రామంలోని నార్నే ఎస్టేట్లో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి పుర్రె, వెంట్రుకలు, చీర, బ్లౌజ్, చేతి సంచి, ఒక చెప్పు కనపడింది. దీంతో వెంటనే స్థానిక మేడ్చల్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మేడ్చల్ సీఐ అద్దాని సత్యనారాయణ, సబ్ ఇన్స్పెక్టర్ మురళీధర్ లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
కర్నూలు జిల్లా గార్గేయపురం చెరువులో ముగ్గురు మహిళల మృతదేహాల మిస్టరీ వీడటం లేదు. ముందుగా నగరవనం వైపు చెరువు ఒడ్డున ఒకే ప్రాంతంలో రెండు మృతదేహాలు కనిపించడగా.. ఆ తరువాత అవతలి ఒడ్డున మరో మహిళ మృతదేహం గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.