దేశ వ్యాప్తంగా బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. సోమవారం బెంగళూరులోని ఆరు ప్రైవేట్ ఆసుపత్రులకు ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో.. ఆ ఆసుపత్రుల్లో పోలీసులు డాగ్ స్క్వాడ్‌లు, బాంబ్ డిస్పోజల్ టీమ్‌లతో భారీ సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించారు. అయితే.. ఈ ఆసుపత్రుల ఆవరణలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఇది నకిలీ బెదిరింపు అని.. ఆదివారం ఆసుపత్రులకు పంపిన ఈ-మెయిల్‌లో దావా చేయబడిందని పేర్కొన్నారు. ఈ-మెయిల్‌లో.. "నేను మీ భవనంలో పేలుడు…
ఢిల్లీ హైకోర్టుకు బాంబుల బెదింపులు రావడం తీవ్ర కలకలం రేపుతుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులను ఈ- మెయిల్ ద్వారా పంపారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు న్యాయస్థానం దగ్గర కట్టుదిట్టమైన భద్రతాను ఏర్పాటు చేశారు.