Ishan Kishan: ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, అభిషేక్‌లను వెనక్కి నెట్టి.. భారత తరఫున రెండో బ్యాటర్‌గా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ishan Kishan Record: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అరుదైన ఘనత సాధించాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. అఫ్గానిస్థాన్‌తో మంగళవారం ఢిల్లీలో జరిగిన రెండో టీ20లో ఇషాన్ 23 బంతుల్లో 38 పరుగులు చేయడంతో ఈ రికార్డు అతడి ఖాతాలో చేరింది. 2026లో ఇషాన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటివరకు టీ20ల్లో 173.2 స్ట్రైక్‌రేట్‌తో ఏకంగా 892 పరుగులు చేశాడు. దీంతో ఒక క్యాలెండర్ ఇయర్లో భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.
ఈ జాబితాలో టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2022లో సూర్యకుమార్ అద్భుతమైన బ్యాటింగ్‌తో 1,164 పరుగులు చేశాడు. ఆ ఏడాది అతడి స్ట్రైక్‌రేట్ 187.43గా ఉండటం విశేషం. ప్రస్తుతం ఇషాన్ కిషన్ 892 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. 2025లో 859 పరుగులు చేయగా.. అతడి స్ట్రైక్‌రేట్ 193.46గా ఉంది. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 781 పరుగులు చేయగా.. అదే ఏడాది సూర్యకుమార్ 1,164 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇషాన్ కిషన్ 2026లో 892 పరుగులు చేయడంతో అభిషేక్, కోహ్లీ రికార్డును అధిగమించాడు. ఇక 2023లో సూర్యకుమార్ మరోసారి 733 పరుగులు చేసి టాప్-5లో చోటు సంపాదించాడు.
Also Read
- Tilak Varma: "ఇది కదా తెలుగోడి పవర్".. తిలక్ వర్మ క్రీజులో ఉంటే గెలుపు ఖాయం.. ఛేజింగ్‌లో 100 శాతం విజయాల రికార్డ్
- Tilak Varma: డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్ గంభీర్ మాటలు గుర్తు చేసుకుని తిలక్ వర్మ భావోద్వేగం..
- Ashwin: ‘నీటిలోంచి బయటపడ్డ చేపలా లబోదిబో’.. వైభవ్ ఆటపై సీనియర్ ప్లేయర్ ఘాటు విమర్శలు..
- Naman Dhir: విధ్వంసకర ఇన్నింగ్స్‌తో.. టీం మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారిన నమన్ ధీర్.. ఎందుకంటే..
ఒక క్యాలెండర్ ఇయర్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు:
1,164 – సూర్యకుమార్ యాదవ్, 2022 (స్ట్రైక్‌రేట్ 187.43)
892 – ఇషాన్ కిషన్, 2026 (స్ట్రైక్‌రేట్ 173.20)
859 – అభిషేక్ శర్మ, 2025 (స్ట్రైక్‌రేట్ 193.46)
781 – విరాట్ కోహ్లీ, 2022 (స్ట్రైక్‌రేట్ 138.23)
733 – సూర్యకుమార్ యాదవ్, 2023 (స్ట్రైక్‌రేట్ 155.95)
తాజావార్తలు
-
Europe Protest: అట్టుడుకుతున్న యూరప్.. ప్రభుత్వాలపై ఆగ్రహజ్వాలలు..
-
France Protests Turn Violent: ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు.. లక్షలాది మంది ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు?.. మాక్రాన్ ఏం చెప్పారు?
-
SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
-
Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
-
Tilak Varma: “ఇది కదా తెలుగోడి పవర్”.. తిలక్ వర్మ క్రీజులో ఉంటే గెలుపు ఖాయం.. ఛేజింగ్‌లో 100 శాతం విజయాల రికార్డ్
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!