Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత వరుసగా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు.. తాజాగా, విజయ్ ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. సేలంలో 25 కొత్త ప్రభుత్వ టౌన్ బస్సులను టీవీకే పార్టీ జెండాలో ఉండే పసుపు, ఎరుపు రంగుల్లో సిద్ధం చేయడం రాజకీయ చర్చకు దారితీసింది. జాన్సన్పేట్ ప్రాంతం నుంచి ఈ కొత్త బస్సుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ప్రభుత్వ బస్సులకు టీవీకే పార్టీ జెండాను పోలిన రంగులు వేయడంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఆస్తులకు అధికార పార్టీ రంగులను ఉపయోగించడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తమిళనాడులో ఎప్పుడూ లేని సంస్కృతిని తీసుకొస్తున్నారంటూ డీఎంకే విమర్శలు గుప్పిస్తోంది. అసలు బస్సులకు ఈ రంగులను ఎవరి ఆదేశాలతో వేశారు? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమా? స్థానిక స్థాయిలో జరిగిన రంగుల ఎంపికా? అన్నదానిపై రవాణాశాఖ నుంచి మాత్రం స్పందన లేదంటున్నారు.. కాగా, పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినప్పుడల్లా.. ప్రభుత్వ కార్యాలయాలు.. బస్సులు.. ఇలా పబ్లిక్ ప్రాపర్టీకి అధికార పార్టీ జెండాను పోలిన రంగులను అదుతూ వివాదాలు కొనితెచ్చుకున్న సందర్భాలు ఎన్నో లేకపోలేదు..
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!