Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
- మక్కా సమీపంలో డ్రోన్‌ను అడ్డుకున్న సౌదీ వైమానిక రక్షణ బలగాలు
- నిషేధిత గగనతలంలోకి ప్రవేశించకముందే డ్రోన్ కూల్చివేత
- సెప్టెంబర్ 15 సాయంత్రం దక్షిణ మక్కాలో ఘటన
- డ్రోన్‌ను హూతీలు ప్రయోగించినట్లు సౌదీ అరేబియా ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drone Attack on Mecca: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు సౌదీ అరేబియాలోని ముస్లింల పవిత్ర నగరం ‘మక్కా’ సమీపానికీ చేరాయి. మక్కా నగరానికి సమీపంలోని నిషేధిత గగనతలంలోకి ఓ డ్రోన్ ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. సౌదీ అరేబియా రాయల్ ఎయిర్ డిఫెన్స్ బలగాలు దానిని అడ్డుకుని కూల్చివేసినట్లు సౌదీ అధికారులు వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో మక్కా, జెడ్డా, తైఫ్ నగరాల్లో భద్రతా అప్రమత్తతను పెంచారు.
సౌదీ నేతృత్వంలోని కూటమి ప్రతినిధి తుర్కి అల్-మాలికి వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం మక్కా సమీపంలోని నిషేధిత గగనతలంలోకి డ్రోన్ ప్రవేశించేందుకు ప్రయత్నించింది. అయితే సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ దానిని గుర్తించి, నగరానికి చేరకముందే అడ్డుకుని నిర్వీర్యం చేసింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఈ డ్రోన్‌ను యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు ప్రయోగించినట్లు సౌదీ అరేబియా ఆరోపించింది. మక్కా, ఇతర పవిత్ర స్థలాల భద్రత తమకు ‘రెడ్ లైన్’ అని సౌదీ అధికారులు హెచ్చరించారు. అయితే ఈ ఆరోపణలను హూతీలు ఖండించారు. మక్కా నగరంతో పాటు ఇతర ఇస్లామిక్ పవిత్ర స్థలాలకు తమ నుంచి ఎలాంటి ముప్పు లేదని హూతీ వర్గాలు స్పష్టం చేశాయి.
మక్కా, దాని పరిసర ప్రాంతాల్లో ఇలాంటి భద్రతా అలర్ట్ జారీ చేయడం 2017 తర్వాత ఇదే తొలిసారిగా అధికారులు పేర్కొన్నారు. హూతీలు గతంలో మక్కాను లక్ష్యంగా చేసుకునేందుకు ప్రయత్నించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజా పరిణామంతో మక్కాతో పాటు జెడ్డా, తైఫ్ నగరాల్లోనూ అధికారులు అప్రమత్తమయ్యారు. మక్కా నగరంలో ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైన కాబా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ముస్లింలు రోజువారీ ప్రార్థనల సమయంలో కాబా వైపు తిరిగి నమాజ్ చేస్తారు. ప్రతి ఏడాది హజ్, ఉమ్రా కోసం భారీ సంఖ్యలో ముస్లింలు మక్కాను సందర్శిస్తారు. దీంతో నగర భద్రతకు సౌదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.
యెమెన్‌లో హూతీ తిరుగుబాటుదారులతో సౌదీ అరేబియాకు చాలాకాలంగా ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఇటీవలి కాలంలో క్షిపణులు, డ్రోన్ల ప్రయోగాలతో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. సౌదీ నగరాలు, కీలక ప్రాంతాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో మక్కా, జెడ్డా, తైఫ్ ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పవిత్ర నగరం మక్కాను లక్ష్యంగా చేసుకున్నట్లు వచ్చిన వార్తలను ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) తీవ్రంగా ఖండించింది. పవిత్ర స్థలాలపై ఎలాంటి ముప్పునైనా అంగీకరించబోమని పేర్కొంది. మరోవైపు హూతీలు మాత్రం మక్కా లేదా ఇతర ఇస్లామిక్ పవిత్ర స్థలాలను తాము లక్ష్యంగా చేసుకోలేదని పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!