Raksha Bandhan: ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కవ అవుతున్నాయి. ఈ విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరినీ కలచివేస్తుంది. వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి వృద్ధుల వరకు చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. అకస్మాత్తుగా అపస్మారక స్థితికి చేరుకుని ప్రాణాలు విడుస్తున్నారు. మృతుల్లో చిన్నారులు ఉండడం బాధ కలిగించే విషయం. అప్పటి వరకు తోటి విద్యార్థులతో ఆడుకుంటున్న చిన్నారులు గుండెపోటుకు గురై క్షణాల్లో మృత్యువాత పడుతున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా గుండెపోటుతో చనిపోతుండడం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇవాళ రాఖీ పండుగ సందర్బంగా దేశమంతా అన్నా చెల్లెల్లు రాఖీ పండుగ చేసుకుంటుంటే ఓ చెల్లికి గుండె పగిలే విషాదం ఎదురైంది. అన్న చనిపోవడంతో గుండెలవిసేలా రోధిస్తూ చనిపోయిన సోదరుడికి రాఖీ కట్టడం చూపరులను కంటతడి పెట్టిస్తోంది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
Read also: South Central Railway: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. సెప్టెంబర్ 26 వరకు ట్రైన్ల కుదింపు
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్టకు చెందిన చౌదరి కనకయ్యకు రాఖీ కట్టేందుకు చెల్లె గౌరమ్మ మంగళవారం పుట్టింటికి వచ్చింది. ప్రతి సంవత్సరం లాగానే చాలా రోజుల తర్వాత అక్క ఇంటికి రావడంతో అన్నా కూడా సంతోషించాడు. అప్పటి వరకు చెల్లెలితో సంతోషంగానే ఉన్నాడు. అయితే అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆనందంగా చెల్లితో మాట్లాడుతుండగా కుప్పకూలిపోయాడు. క్షణాల్లోనే కనకయ్య గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబ సభ్యలకు ఏం జరుగుతుందో అస్సలు అర్థంకానీ పరిస్థితి ఎదురైంది. కనకయ్యను ఏమైందంటూ తట్టినా ఉలుకు పలుకు లేకుండా పడి ఉండటంతో కుటుంసభ్యులు షాక్ తిన్నారు. కనకయ్య మృతి చెందినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు మనతో వున్న కొడుకు ఒక్కసారిగా చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎంతో సంతోషంతో అన్నయ్యకు రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లెలికి అన్నయ్య మృతితో తీవ్ర విషాదం మిగిలింది. చివరగా అన్నయ్య మృతదేహానికి సోదరి గౌరమ్మ రాఖీ కట్టి తన ప్రేమను చాటుకుంది. ఇదే చివరి రాఖీ అంటూ విలపించింది. అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న అనురాగాన్ని చూసిన వాళ్లంతా కంటతడి పెట్టారు. ఏ సోదరికీ ఇలాంటి కష్టాలు రాకూడదని గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Uttar Pradesh: హిందూమతంపై కామెంట్స్.. “ఆ నేత నాలుక కోసేస్తే రూ. 10 లక్షల రివార్డ్”..