South Central Railway: సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. కాజీపేట రైల్వే జంక్షన్‌లోని బలార్షా సెక్షన్‌లో మూడో లైన్ ఇంటర్‌లాకింగ్, నాన్ ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా నిన్నటి నుంచి (ఆగస్టు 29) నుంచి ఇంటర్‌సిటీ, భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ అనే రెండు రైళ్లను బెల్లంపల్లికి కుదించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 26 వరకు హైదరాబాద్ సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య నడిచే ఇంటర్‌సిటీ రైలు, సికింద్రాబాద్-బలార్ష మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలు సిర్పూర్ కాగజ్‌నగర్, రెండు ప్రధాన రైల్వే స్టేషన్‌లలో మూడవ లైన్ పనులు జరుగుతున్నందున బెల్లంపల్లికి కుదించబడినట్లు వెల్లడించారు. బెల్లంపల్లి-బలార్ష సెక్షన్ మూడో లైన్ పనులు పూర్తి కావస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైళ్లు ఎలాంటి మార్పులు లేకుండా బెల్లంపల్లి వరకు మాత్రమే నడుస్తాయని వివరించారు. దీంతో పాటు గతంలో రద్దు చేసిన రామగిరి, సింగరేణి, డోర్నకల్ ప్యాసింజర్, కాకతీయ రైళ్ల రద్దును అక్టోబర్ 2 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
Read also: Uttar Pradesh: హిందూమతంపై కామెంట్స్.. “ఆ నేత నాలుక కోసేస్తే రూ. 10 లక్షల రివార్డ్”..
సికింద్రాబాద్-దానాపూర్ రైళ్ల మళ్లింపు..
బీహార్‌లోని సికింద్రాబాద్-దానాపూర్ మధ్య నడిచే రైళ్లను (రైలు నంబర్ 12791 మరియు 12792) సెప్టెంబర్ 10 నుండి అక్టోబర్ 15 వరకు దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. బనారస్, వారణాసి మరియు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ బదులు ఈ ప్రకటన వెల్లడించింది. జంక్షన్ మార్గంలో, ఈ రైళ్లు ప్రయాగ్‌రాజ్, మీర్జాపూర్ మరియు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ మార్గంలో నడుస్తాయి.
Dharavi Project: ధారవి రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో అదానీ గ్రూప్‌కు ప్రయోజనం కలిగిందా ?