సింహాచల పుణ్యకేత్రంలో వరాహ నరసింహ స్వామి నిజరూప దర్శనం ప్రారంభమైంది. అప్పన్న స్వామిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. పుణ్యక్షేత్రంలో భక్తులతో కిటకిటలాడుతోంది. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే స్వామి నిజరూపంలో దర్శనం ఇస్తారు. అందువల్ల భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.
విశాఖ జిల్లాలోని సింహాచలం అప్పన్న ఆలయం భక్తజన సంద్రంగా మారింది. సింహాచలం ఆలయంలో స్వామివారి చందనోత్సవంలో పాల్గొన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. అంతరాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు తమిళిసై. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం లభించడం మహాభాగ్యం అన్నారు తమిళిసై. తొలిసారి చందనోత్సవంలో పాల్గొన్నాను. ఇక్కడ వరాహ లక్ష్మీనరసింహస్వామి పవర్ ఫుల్ గాడ్, ఆలయంలో అడుగు పెడితేనే వైబ్రేషన్స్ ఉన్నాయ్ అన్నారు తెలంగాణ గవర్నర్ తమిళసై.కొండపై స్వామివారి చందనోత్సవంకు క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతోంది. సాయంత్రం వరకు…