పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. మాజీ మంత్రి, వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు కేంద్రనాయకత్వం ప్రకటించడంపై ఆయన మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి తనని సస్పెండ్ చేసినట్లు సమాచారం అందిందన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చాను. 12ఏళ్ల వయసు నుంచే రాజకీయాలపై ఆసక్తి పెరిగింది.. నేను రాజకీయాల్లోకి వచ్చే సమయానికి టీడీపీ లేదు.. కేవలం కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమే వున్నాయన్నారు. NTR అంటే వున్న అభిమానంతో టీడీపీలో…
విభజన కారణంగా తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల విషయంలో సమస్యలు, వివాదాలు తలెత్తుతూనే వున్నాయి. కృష్ణా నదిపై ఏర్పాటైన వివిధ జలాశయాల విషయంలో ఈ ఇబ్బందులు మరీ ఎక్కువనే చెప్పాలి. రెండురాష్ట్రాల మధ్య కేంద్రం పెద్దన్న పాత్రను పోషిస్తూనే వుంది. వివిధ కారణాల వల్ల కేఆర్ఎంబీ సమావేశాలకు తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒకటి హాజరుకావడం లేదు. ఈ నేపథ్యంలో ఈమధ్య జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కృష్ణా నదిపై…