సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా కూడా అతనికి సరైన హిట్ పడలేదు.. డిజే టిల్లు సినిమాతో భారీ సక్సెస్ ను అందుకోవడం మాత్రమే కాదు.. హిట్ ట్రాక్ ను మెయింటైన్ చేస్తున్నాడు.. ఆ సినిమాతో సిద్దు జాతకం పూర్తిగా మారిపోయింది.. ఒక్కమాటలో చెప్పాలంటే ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు.. ఆ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. టిల్లు స్క్వేర్ మొదటి పార్ట్ కంటే కూడా భారీ విజయం సాధిస్తుంది.. 70 కోట్ల వసూల్ ను అందుకున్న ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లోకి చేరబోతుంది..
రీసెంట్ గా వచ్చిన టిల్లు క్యారెక్టర్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది.. రెండు సినిమాలు బాగా జనాలను మెప్పించాయి.. ఇప్పుడు మరో సీక్వెల్ ను తీసుకురాబోతున్నాడు.. టిల్లు క్యూబ్ కూడా తీస్తామని అధికారికంగానే ప్రకటించారు.. ఇక తాజాగా సిద్దు ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.. ఈ సందర్బంగా ఆయన మరో సినిమా గురించి ఆసక్తికర పాయింట్ చెప్పారు..
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. డీజే టిల్లులో అమ్మాయి మోసం చేసే పాయింట్ ఉంది. టిల్లు స్క్వేర్ అదే పాయింట్ తో పాటు మాఫియా డాన్ మిషన్ లాంటిది ఉంది.. అదే ఫార్ములా కాకుండా ఈసారి కొత్తగా తెరకేక్కించాలని ఆలోచిస్తున్నాం అని చెప్పాడు.. మామూలు మనిషి అయితే సినిమాల్లో లాజిక్స్ తో కథ రాసుకోవాలి అదే ఒక సూపర్ హీరోగా టిల్లుని చేస్తే అతనితో ఏమైనా చేయించొచ్చు కథలో ఎలాంటి మార్పులైనా చేయొచ్చు కాస్త వీఎఫెక్స్ కోసం ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. టిల్లుకు సూపర్ హీరో అయితే, సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తాడు? ఎలా బిహేవ్ చేస్తాడు? గాల్లోకి ఎగరడం, టిల్లు సూపర్ హీరో అయితే ఎలా ఉంటుంది అనే పాయింట్ మీద కథ ఉండబోతుంది.. ఆ కథను త్వరలోనే మొదలు పెట్టబోతున్నట్లు చెప్పాడు.. ఈ మధ్య ఇలాంటి సినిమాలు కూడా వస్తున్నాయి.. మంచి సక్సెస్ ను అందుకుంటున్నాయి.. దాంతో ఈ సినిమా పై ఇప్పట్నుంచే మంచి అంచనాలు నెలకొన్నాయి..