అర్హులైన వారికి డబల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని ఆందోళన చేస్తున్న సీపీఎం నేతలపై చేయి చేసుకున్నారు సూర్యపేట జిల్లా మోతె ఎస్ఐ మహేష్. ఎస్సై సిపిఎం నేతలపై చేయి చేసుకోవడంతో గ్రామస్తులకు ఎస్ఐకి మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. మోతే మండలం విబాలాపురంలో ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ల పంపిణీకి సిద్ధమైంది.. ఎమ్మెల్యే చేతుల మీదుగా డబ్బులు బెడ్ రూమ్ ల ను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే అర్హులైన అందరికీ డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు.
UPSC: సాధారణ కానిస్టేబుల్ రామ్ భజన్.. ఇప్పుడు అధికారి కాబోతున్నాడు.. సివిల్స్ కోసం సుదీర్ఘ ప్రయాణం..
అనర్హులకు డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నరు. ఆందోళన చేస్తున్న వారికి సిపిఎం పార్టీ మద్దతు ప్రకటించింది. వారితో కలిసి ఆందోళనలో పాలుపంచుకుంది. ఈ క్రమంలో గ్రామంలోకి ఎమ్మెల్యే రాకుండా కంచె వేసి ఆందోళనకు దిగారు గ్రామస్తులు. విషయం తెలుసుకున్న పోలీసులు కంచె తీసే ప్రయత్నం చేశారు ఎస్ ఐ… ఎస్సైని సిపిఎం నేతలు అడ్డుకోవడంతో సిపిఐ నేతలను లాగి పడేసాడు ఎస్సై.. అతనిపై ఎస్ఐ చెయ్యి చేసుకోవడంతో సిపిఎం నేతలు, గ్రామస్తులు ఎస్సై తో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
New Parliament pics: కొత్త పార్లమెంట్ ప్రతీ భారతీయుడు గర్వించేలా ఉంటుందన్న ప్రధాని….