ఏపీలో మోటార్లకు మీటర్ల బిగింపు వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. కేంద్రం నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మీటర్లు బిగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగింపును వ్యతిరేకిస్తూ అనంతపురంలో సీపీఐ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. గాంధీ సర్కిల్ నుంచి పవర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా ఎద్దుల బండిలో రైతులు ఉరికి వేలాడుతూ నిరసన తెలిపారు. ఎద్దుల బండిని తోలారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ప్రభుత్వం తీరుపై…
రాష్ట్రంలో జగన్ దుర్మార్గమైన పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ప్రధాని మోడీ , హోంమంత్రి అమిత్ షా ల తో కుమ్మక్కై రాష్ట్రాన్ని అదానీ చేతిలో పెట్టారు. అదానీ భార్యకి రాజ్యసభ సీటు ఇచ్చే బదులు పార్టీలో చేర్చుకుంటే బాగుంటుంది. మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ తో జగన్ అభాసు పాలయ్యారు. మంత్రి టెన్త్ పేపర్ లీక్ కాలేదని అంటాడు.. సీఎం ఏమో పేపర్ లీకు అయ్యిందంటాడు. జగన్ కి నిజంగా దమ్ముంటే…
ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు, గ్యాస్ ధరలను నిరసిస్తూ అనంతపురంలో వామపక్షాల నేతలు నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం ఏపీ సెక్రటేరియట్ ముట్టడికి వామపక్షాల నేతలు పిలుపునిచ్చారు. దీంతో సీపీఎం, సీపీఐ కార్యకర్తలు పోరు గర్జనకు వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. అటు సీపీఐ ఆధ్వర్యంలో విజయవాడలో తలపెట్టిన పోరుగర్జన కార్యక్రమానికి వెళ్తున్న రామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అనంతపురంలో వామపక్షాల నిరసన ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, ఆందోళన కారుల మధ్య తోపులాట…