India Tour of Zimbabwe: జింబాబ్వే పర్యటనకు వెళ్లని శుభ్‌మన్ గిల్.. కారణమిదే..?
- జింబాబ్వే పర్యటనకు వెళ్లని శుభ్‌మన్ గిల్
- ఈరోజు జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమిండియా
- జింబాబ్వే టూర్ కు కెప్టెన్ గా వ్యవహరించనున్న గిల్
- ప్రస్తుతం అమెరికాలో ఉన్న శుభ్‌మన్ గిల్
- అటు నుంచి నేరుగా జింబాబ్వే వెళ్లనున్న గిల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా ఈరోజు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. టీ20 ప్రపంచకప్ కారణంగా ఈ టూర్‌కు యువ జట్టును ఎంపిక చేశారు. ఈ టీమ్‌లోని చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్లో సత్తా చాటిన ప్లేయ్లకు అవకాశం కల్పించారు. అలాగే.. జట్టు కెప్టెన్సీ పగ్గాలు శుభ్‌మన్ గిల్ చేతికి అందించారు. అయితే.. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. గిల్ జట్టుతో కలిసి జింబాబ్వే వెళ్లలేదు. టీమిండియా జింబాబ్వే పర్యటనకు సంబంధించి బీసీసీఐ తన X హ్యాండిల్ తెలిపింది. NCA చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ జట్టుకు కోచ్‌గా ఉన్నారు. అతను టీమిండియాతో కలిసి జింబాబ్వే పర్యటనకు వెళ్ళాడు. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. ఇప్పుడు జట్టుకు కొత్త కోచ్రానున్నాడు. అయితే కొత్త కోచ్ శ్రీలంక పర్యటనలో జట్టుతో చేరతాడు.
Read Also: Kalavedika NTR Film Awards: ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ అందుకున్నది వీరే !
Also Read
- APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్‌పై భారీ విజయం.!
- Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
- WWDCలో పొరపాటున 'ఫోల్డబుల్ ఐఫోన్' వివరాలు లీక్ చేసుకున్న Apple.!
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
అసలు విషయానికొస్తే.., గిల్ ప్రస్తుతం విరామంలో ఉన్నందున జట్టుతో కలిసి వెళ్లలేదు. ఆయన అమెరికాలో రెస్ట్ తీసుకుంటున్నాడు. టీ20 ప్రపంచకప్-2024కి ఎంపికైన టీమ్ ఇండియా రిజర్వ్ ఆటగాళ్లలో గిల్ ఉన్నాడు. కానీ అమెరికాతో మ్యాచ్ ముగిసిన తర్వాత.. గిల్ జట్టు నుండి విడుదలయ్యాడు. అయినప్పటికీ గిల్ అక్కడే ఉన్నాడు. కాగా.. శుభ్‌మన్ గిల్ అమెరికా నుండి నేరుగా జింబాబ్వేకి వెళ్లి హరారేలో జట్టులో చేరతాడు.
Read Also: Aditya L1 Mission: ఇస్రో మరో చరిత్ర.. హాలో కక్ష్యను పూర్తి చేసిన ఆదిత్య-ఎల్1
జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో చివరి నిమిషంలో భారత్ మార్పులు చేసింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు ఈ మార్పులు చేశారు. ఈ జట్టులో యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ మరియు శివమ్ దూబే ఉన్నారు. అయితే ఈ ముగ్గురూ టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న టీమ్ ఇండియా సభ్యులు. వీరితో పాటు టీమ్ ఇండియా ప్రస్తుతం తుఫాను కారణంగా బార్బడోస్‌లో చిక్కుకుపోయింది. ఈ కారణంగా ఈ ముగ్గురు జింబాబ్వే పర్యటనకు వెళ్లలేదు. అందుకే రెండు మ్యాచ్‌ల కోసం జట్టులో మార్పులు చేశారు. జితేష్ శర్మ, సాయి సుదర్శన్, హర్షిత్ రాణా జట్టులో స్థానం కల్పించారు.
తాజావార్తలు
-
Peddi : భారీ నష్టాల దిశగా ‘పెద్ది’ నాన్ తెలుగు స్టేట్స్.. ఓవర్ సీస్ అంతకుమించి?
-
Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
-
Kerala Parotta : కేరళ స్టైల్ పరోటా ఇష్టమా.? తినే ముందు ఇవి తెలుసుకోండి..!
-
APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్‌పై భారీ విజయం.!
-
Sai Pallavi : పవర్ ఫుల్ పోలీస్ గా సాయిపల్లవి… ధనుష్ సినిమాలో లాఠీ పట్టనున్న బ్యూటీ
ట్రెండింగ్
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!