Shreyas Iyer Health Update: ఆస్ట్రేలియా పర్యటనలో భారత క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన మూడో వన్డే సందర్భంగా.. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కారీ క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో అయ్యర్ కింద పడిపోయాడు. ఈ సంఘటనలో శ్రేయస్ ప్లీహానికి గాయమైంది. అనంతరం ఆయనను సిడ్నీలోని ఒక ఆసుపత్రిలో చేర్చారు. వైద్య పరీక్షలో అయ్యర్‌కు స్వల్ప అంతర్గత రక్తస్రావం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. తాజాగా శ్రేయస్ అయ్యర్ శస్త్రచికిత్సకు సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది.
READ ALSO: Bihar Election 2025: మహాఘట్ బంధన్ మేనిఫెస్టో విడుదల.. ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం
విజయవంతంగా శ్రేయాస్‌కు శస్త్రచికిత్స..
శ్రేయస్ అయ్యర్ ప్లీహానికి అయిన గాయానికి విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి అయ్యింది. ఇప్పుడు అయ్యర్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని వైద్యులు చెప్పారు. పలు నివేదికల ప్రకారం.. ప్రస్తుతం శ్రేయస్అయ్యర్ పరిస్థితి పూర్తి స్థిరంగా ఉందని, శ్రేయస్ ఐసీయూ నుంచి విడుదలయ్యాడు. వైద్యులు మాట్లాడుతూ.. శ్రేయస్‌కు జరిగింది ఒక చిన్న శస్త్రచికిత్స అని, కానీ అయ్యర్ కనీసం ఐదు రోజులు, గరిష్టంగా ఒక వారం పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయ్యర్ పరిస్థితి వేగంగా మెరుగుపడుతోందని చెప్పారు. ప్రస్తుతం అయ్యర్‌ను జనరల్ వార్డుకు తరలించినట్లు వెల్లడించారు. ఆయన త్వరలోనే పూర్తి ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వెళ్తారని వైద్యులు చెప్పారు. సిడ్నీలో ఆయన గాయాన్ని బీసీసీఐ వైద్య బృందం కూడా నిశితంగా పరిశీలిస్తోంది.
ఫీల్డ్కి రావడానికి ఎంత టైం పడుతుంది..
శ్రేయాస్ అయ్యర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత భారతదేశానికి తిరిగి రానున్నాడు. అయితే అయ్యర్ తిరిగి మైదానంలోకి రావడానికి నాలుగు నుంచి ఆరు వారాలు పట్టవచ్చని వైద్యులు అభిప్రాయపడ్డారు. ఈక్రమంలో నవంబర్ 30 నుంచి ఇండియాలో జరగే భారత్ – దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ దూరమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Bihar Elections 2025: బీహార్ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్.. పీకేకి ఓటర్ ఐడీ పోటు.. రంగంలోకి ఈసీ!