జయం సినిమాతో తమిళ సినీ రంగ ప్రవేశం చేసిన జయం రవి 25కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన ‘కథలిక్ నేరమిల్లి’ రేపు (14-01-25) పొంగల్ పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కృతికా ఉదయనిధి దర్శకత్వంలో ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సందర్భంలో జయం రవి తన పేరును రవిమోహన్‌గా మార్చుకున్నాడు. తన X పేజీలో ఒక ప్రకటనలో, ఈ కొత్త సంవత్సరంలో నా జీవితంలో కొత్త విషయాలు మొదలుపెట్టబోతున్నా, అవి మీతో షేర్ చేసుకుంటున్నా. సినిమా అనేది నా ప్యాషన్, అదే నన్ను ఇక్కడ నిలబెట్టి మీ అందరి సపోర్ట్ ఇచ్చింది. ఇకపై అందరూ నన్ను రవి లేదా రవి మోహన్ అని పిలవండి. ఇకపై నన్ను జయం రవి అని పిలవకండి, ఇది నా రిక్వెస్ట్. అలాగేరవి మోహన్ స్టూడియోస్ స్థాపించి సరికొత్త కథలను సినిమాల రూపంలోకి మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే నా ఫ్యాన్స్ కి నేనిచ్చే మెసేజ్ ఏంటంటే.. నాకున్న అన్ని ఫ్యాన్స్ క్లబ్స్ ని కలుపుతూ రవి మోహన్ ఫ్యాన్స్ ఫౌండేషన్ అనే సంస్థగా మారుస్తున్నా, దీని ద్వారా సేవా సహాయ కార్యక్రమాలు జేసి సొసైటీలో మంచిని పెంపొందించడం చేస్తాను.
Sankranthiki Vasthunam: హైదరాబాద్ షోస్ అన్నీ హౌస్ ఫుల్!
నా ఈ కొత్త జర్నీలో మీ అందరూ నాకు సహకరించండని కోరారు. ‘రవిమోహన్ స్టూడియోస్’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సెలబ్రేట్ చేసుకునే సినిమాలు తీసుకురావాలనే లక్ష్యంతో ఈ సంస్థ ప్రారంభమైంది. ఈ సంస్థ టాలెంట్, మంచి కథలపై దృష్టి సారిస్తుంది. అర్థవంతమైన కథలను తెరపైకి తీసుకురావడానికి సహాయపడుతుంది. తమిళ ప్రజల ఆశీర్వాదంతో, పైన పేర్కొన్న విధంగా నన్ను ఆహ్వానించి, కొత్త ప్రయత్నానికి తమ మద్దతును అందించాలని నా అభిమానులను, మీడియాను మరియు ప్రతి ఒక్కరినీ వినమ్రంగా అభ్యర్థిస్తున్నాను. మీ ప్రోత్సాహం నాకు ఎప్పుడూ గొప్ప ప్రేరణ. ఈ కొత్త ప్రయాణంలో మీ సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తున్నాను. అందరికీ పొంగల్ శుభాకాంక్షలు అని పోస్ట్ చేశాడు. మొదటి సినిమా జయం విజయంతో ఆయనకు జయం రవి అని పేరు పెట్టడం గమనార్హం.