పంజాబ్ కింగ్స్ తమ జట్టుకు కొత్త కెప్టెన్‌ను ఆదివారం ప్రకటించింది. ఐపీఎల్ 2025లో పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ వ్యవహరించనున్నాడు. తొలి మ్యాచ్‌కి కెప్టెన్సీ చేస్తే భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించనున్నాడు. రెండు కంటే ఎక్కువ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి భారత కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ నిలిచాడు.
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య నేడు రెండో టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. రెండో టీ20లో శాంసన్ సెంచరీ సాధిస్తే.. టీ20ల్లో హ్యాట్రిక్ సెంచరీలు చేసిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కుతాడు.