నార్త్ టెక్సాస్ హైస్కూల్ లో సోమవారం కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. ఆర్లింగ్టన్ లోని లామర్ హైస్కూల్ లో బిల్డింగ్ వెలుపల ఈ కాల్పులు జరిగినట్లు అర్లింగ్టన్ డిపార్ట్మెంట్ తెలిపింది. నిన్న ఉదయం 7 గంటల లోపు హైస్కూల్ ఆవరణలో పలుమార్లు కాల్పులు జరిగాయన్న వార్తలపై ఆర్లింగ్టన్ పీడీ స్పందించారు. ఉదయం 7.35 గంటలకు తరగతులు ప్రారంభమవుతాయని, కాల్పులు జరిగినప్పుడు క్యాంపస్ లోకి రాలేదని పోలీసులు తెలిపారు. అయితే అనుమానిత షూటర్ పాఠశాలలోకి ప్రవేశించాడని తాము విశ్వసించడం లేదని పోలీసులు అన్నారు.
Also Read : Teachers Unions: ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లపై సంతకాలు చేస్తే తప్పేంటి?
కాగా.. కాల్పులకు గురైన బాలుడిని అధికారులు, పాఠశాల సిబ్బంది హస్పటల్ కు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ సదరు స్టూడెంట్ పరిస్థితి విసమించడంతో మరణించాడు. అయితే ఈ కాల్పుల్లో మరో విద్యార్థికి కూడా గాయాలు అయ్యాయి. అయితే వాటి వల్ల ఆమెకు ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు తెలిపారు. విద్యార్థులపై కాల్పులు జరిపిన అనుమానితుడిని ఘటన జరిగిన కొద్దిసేపటికే ఆ వ్యక్తిని గుర్తించినట్లు ఆర్లింగ్టన్ పోలీసులు వెల్లడించారు. దీంతో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై హత్యానేరం మోపినట్లు చీఫ్ జోన్స్ పేర్కొన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి మైనర్ కావడంతో అతడి వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. నిందితుడిని ఆ ప్రాంతంలోని జువైనల్ డిటెన్షన్ సెంటర్ లో ఉంచారు.
Also Read : Customer Care Fraud: గూగుల్‌లో నకిలీ వెబ్‌సైట్లు.. యాప్ డౌన్లోడ్ చేయించి నిలువు దోపిడి
అయితే కాల్పులు జరిగిన తర్వాత పాఠశాలను అధికారులు మూసివేశారు. తరువాత భవనం మొత్తాని తనిఖీ చేశారు. దాదాపు 3.5 గంటల తర్వాత లాక్ డౌన్ ను ఎత్తివేశారు. అయితే ఈ కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనకు సంబంధిచిన అదనపు సమాచారాన్ని త్వరలోనే వెల్లడిస్తామని అర్లింగ్టన్ పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా ఇటీవల జార్జియాలోని డగ్లన్ కౌంటీలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. ఆరుగురు గాయపడ్డారు. పార్టీ జరుపుకునేందుకు 100మందికి పైగా యువకులు ఓ ఇంట్లో గుమిగూడారు. ఇంట్లో జరిగిన పార్టీలో ఘర్షణ కారణంగానే కాల్పులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.