Customer Care Fraud: గూగుల్‌లో నకిలీ వెబ్‌సైట్లు.. యాప్ డౌన్లోడ్ చేయించి నిలువు దోపిడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Customer Care Fraud: టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ ఇంటి దగ్గర కూర్చుని ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారు. ఒక్క పాస్‌వర్డ్, ఓటీపీ, ఇంటి చిరునామా ఇవ్వడం ద్వారా వారికి కావాల్సిన అంగట్లో వస్తువులన్నీ డెలివరీ చేయబడతాయి. అంతేకాకుండా.. రైలు, బస్సు, విమానం రిజర్వేషన్లు ఇంటి నుంచి సులువుగా చేస్తున్నారు. ఈ క్రమంలో మనం కస్టమర్‌కేర్ సెంటర్లను ఆన్లైన్లో వెతికామంటే.. సైబర్ నేరగాళ్ల చేతిలో బలైపోయినట్టే.. ఇలాంటి సైబర్ కేసులు రెండు నెలల్లో నగరంలో సుమారు 200 దాకా ఇలాంటి తరహా కేసులు నమోదయ్యాయి.
నకిలీ వెబ్‌సైట్లు
Also Read
నకిలీ వెబ్‌సైట్లు నయాగా తయారు చేసి ఫోన్ నంబర్లను సైబర్ నేరగాళ్లు అందులో ఉంచుతున్నారు. ఇలా.. హరియాణా, ఝార్ఖండ్ సహా కొన్ని రాష్ట్రాల్లో రూ.5 వేలు ఇస్తే అసలైన వెబ్‌సైట్ తరహాలో కొత్తవి తయారుచేస్తున్నారు. దీన్ని గూగుల్‌లో నకిలీ వెబ్‌సైట్ పైభాగంలో వచ్చేలా ప్రత్యేకంగా కొందరిని నియమించి వేల సంఖ్యలో క్లిక్కులు, రేటింగ్‌లు ఇస్తారు. దీంతో గూగుల్‌లో నకిలీదే ముందు కనిపిస్తుంది. వీటిని నమ్మి బాధితులు మోసపోతున్నారు. ఇలా భాగ్యనగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ ఏడాది తొలి రెండు నెలల్లో ఇలాంటి మోసాలు దాదాపు 200 వరకూ నమోదయ్యాయి. ఈ గూగుల్ ఫ్రాడ్ వల్ల బాధితులు రూ.8 కోట్ల వరకు పోగొట్టుకున్నారు. ఇలాంటి తరహా మోసాలు మున్ముందు పెరిగే అవకాశముందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా సరే.. ఏదైనా కంపెనీ కస్టమర్ కేర్ నంబర్ కోసం మీరు గూగుల్‌లో వెతికినప్పుడు ముందుగా వచ్చిన నంబర్‌ను నమ్మొద్దని, అది కరెక్ట్ నంబరా లేదా ఫేక్ నంబరా అనేది చెక్ చేసుకోవాలి. కాగా.. సాధారణంగా ప్రతి కంపెనీ తమ ప్రాడక్ట్స్, యూజర్ గైడ్ బుక్స్, రసీదులపై తమ కస్టమర్ కేర్ నంబర్‌ను ప్రింట్ చేసి ఉంచుతుందని, వీలైనంత వరకు మీరు వాటిని సంప్రదించాలని కోరారు. అయితే.. బ్యాంకులు డెబిట్, క్రెడిట్ కార్డులపై ఈ ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచుతాయి. అధికారిక వెబ్‌సైట్లు హెచ్‌టీటీపీ, తాళం గుర్తుతో మొదలవుతాయి. ఈఫ్రాడ్ మెసాలకు ఓ హైదరాబాద్ వాసి ఆన్లైన్లో బస్ టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే.. వేరే పనులు ఉండటం వల్ల రిజర్వేషన్ రద్దు చేసుకోవాలనుకున్నాడు.. దానికోసం ఆన్లైన్లో కస్టమర్ కేర్ నంబర్ కోసం సర్చ్ చేసి చివరకు అది ఫేక్ కావడంతో సైబర్ కేటుగాళ్ల చేతిలో బుక్కయ్యాడు దీంతో బాధితుడు నుంచి రూ.1. 89లక్షలు కాజేశారు.
నిలువు దోపిడి..
ఇక మరో హైదరాబాద్ వాసి ఆన్లైన్లో ఓ వస్తువు కొనుగోలు చేశాడు. అదికాస్తా సమయానికి డెలివరీ కాకపోవడంతో కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్‌లో వెతికాడు. అందులో ఓ నంబర్ కనిపించడంతో దానికి కాల్ చేసాడు. అటునుంచి ఓ వ్యక్తి కాల్ లో మాట్లాడి ఓ యాప్ డౌన్ లోడ్ చేస్తే మీకు సులువుగా పని జరుగుతుందని నమ్మబలికాడు. దీన్ని నమ్మిన కస్టమర్ ఆ యాప్ ను డౌన్లోడ్ చేశాడు. అంతే. నిమిషంలో కస్టమర్ బ్యాంకు ఖాతాలో వున్న నుంచి రూ.99 వేలు ఖాళీ అయ్యాయి. ఇలా కొత్త తరహామోసాలకు తెర లేపుతున్నారు. వీల్ల ఉచ్చులో పాపం అమాయకులు బలి అవుతున్నారు. తెలివిగా వున్నా వారి అమాయకులను ఆసరాగా తీసుకుని వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి వారిని నమ్మకూడదని తెలివిగా మసులు కోవాలని అధికారులు ఎన్ని సార్లు చెబుతున్నా బాధితులు .. కిలాడీల మెసాల ఉచ్చులో పడి వారి ఖాతాల్లోని డబ్బులను ఖాలీ చేస్తున్నారు. వీరి మెసాలకు అలర్ట్ గా ఉండాలని అధికారులు చెబుతున్నా అయినా సైబర్ క్రైం మోసాలకు తెరలేపుతున్న కేటు గాళ్ల చేతుల్లో మోసాపోకండని ఎటువంటి చిన్న అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
Khalistan : అమృత్ పాల్ సింగ్ వెనుక వాళ్ల హస్తం..
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?