నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగం చేస్తున్న దానిని నిలబెట్టుకోవడం కూడా పెద్ద సవాలే. సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు, జూమ్ కాల్స్ ఇలా ఎన్నో జీవితంలో ముడిపడి ఉంటాయి. వాటిలో దేనికీ దేనికి హాజరు కాకపోయినా రిమార్క్ పడుతుంది. అందుకే కాబోలు అనేకమంది వ్యక్తులు వేరేపనులలో ఉన్న మీటింగ్ లకు హాజరవుతున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మరో ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది.
RR vs RCB: టాస్ గెలిచి ఆర్సీబీని బ్యాటింగ్ కు ఆహ్వానించిన రాజస్థాన్ రాయల్స్..
బెంగళూరులోని ఓ చెప్పుల షాప్ లో షాపింగ్ చేస్తూ ల్యాప్ టాప్ తో టీమ్ మీటింగ్ కు హాజరైన ఓ మహిళ ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఫొటోకు సంబంధించి, కార్తీక్ భాస్కర్ అనే సోషల్ మీడియా వినియోగదారు ఒక ఫోటోను పంచుకున్నారు. అందులో ఒక మహిళ షూల కోసం షాపింగ్ చేస్తున్నప్పుడు తన ల్యాప్‌టాప్‌లో టీమ్ మీటింగ్‌కు హాజరవుతున్నట్లు చూడవచ్చు.
Gangs of Godavari: ట్రైలర్ లాంఛ్ అడ్డా ఫిక్స్ చేసిన విశ్వక్‌సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’..
ఈ పోస్ట్‌పై ఇంటర్నెట్ వినియోగదారుల స్పందన విభిన్నంగా స్పదింస్తున్నారు. కొంతమంది ఈ చర్యను కాస్త తమాషాగా భావించారు. మరికొందరు విచారంగా భావించారు. వినియోగదారుల్లో ఒకరు ఇది మల్టీ టాస్కింగ్ అని, ఇలాంటి వాటితో ఎటువంటి సమస్య లేదని కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే నేను ఆఫీసులో ఉన్నప్పుడు విండో లేదా యాప్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి వాటిలో షాపింగ్ చేస్తాను అంటూ కామెంట్ చేసాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. అలాంటి వ్యక్తుల వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ఎందుకు రద్దు చేస్తున్నారో వివరించాడు. ఇది భారతదేశంలోని ప్రజలకు పని నీతి లేదనే అభిప్రాయాన్ని కలిగించే విచారకరమైన పరిస్థితి అంటూ వివరించాడు. మరో నెటిజన్ కాస్త వైరైటీగా స్పందిస్తూ.. ఇలాంటి పనికిమాలిన మీటింగ్ నిర్వాహకులకు ఎలాంటి బూట్లు వేయాలో ఆ మహిళ ఆలోచిస్తోందని అన్నారు.
Today in @peakbengaluru, I saw a person shoe shopping while attending a team meeting on her laptop. pic.twitter.com/qHQ2omYDIl
— Karthik Bhaskara (@Kaey_bee) May 22, 2024