UP: షాకింగ్.. డబ్బుపై దురాశతో మళ్లీ పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు
- యూపీలోని మధురలో ఓ షాకింగ్ కేసు
- మరోసారి పెళ్లి చేసుకున్న ఓ జంట
- ఇంతకుముందు వారిద్దరికీ పెళ్లి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని మధురలో ఓ షాకింగ్ కేసు వెలుగు చూసింది. ఓ జంట మరోసారి పెళ్లి చేసుకుంది. అప్పటికే వారిద్దరికీ పెళ్లి కాగా.. మరోసారి పెళ్లి చేసుకున్నారు. అందుకోసం సామూహిక వివాహ కార్యక్రమానికి వచ్చారు. కాగా.. ఈ విషయం అధికారులకు తెలియగానే వెంటనే అక్కడికి చేరుకుని ఆరా తీశారు. ఈ క్రమంలో.. వారు డబ్బుపై దురాశతో మరోసారి పెళ్లి చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. కాగా.. వీరికి సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన శనివారం రోజు జరిగింది.
Read Also: Expensive Tea: ఒక కప్పు టీ ధర రూ. లక్ష.. దీన్ని తాగాలంటే ఈఎంఐ తీసుకోవాల్సిందే?
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ముఖ్యమంత్రి సామూహిక వివాహ వేడుకల్లో భాగంగా బీఎస్ఏ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో 142 జంటలకు వివాహాలు జరిగాయి. ఈ జంటలకు రూ.35 వేలు, పెళ్లి ఖర్చుకు ఒక్కో జంటకు రూ.5 వేలు, గృహోపకరణాలకు రూ.10 వేలు అందజేశారు. దీంతోపాటు ఇరువర్గాలకు విందు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే.. పెళ్లి చేసుకుంటే డబ్బు వస్తుందన్న అత్యాశతో ఓ జంట అక్కడికి చేరుకుని మళ్లీ పెళ్లి చేసుకున్నారు. అయితే.. వారు నెల రోజుల క్రితమే వివాహం చేసుకున్నారు. ఈ జంట తమ మొదటి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వెడ్డింగ్ కార్డులను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Read Also: Priyanka Gandhi: పాలస్తీనాకు ప్రియాంక మద్దతు.. ప్రత్యేక బ్యాగ్‌తో హల్చల్
శనివారం మధురలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక కళ్యాణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం కింద 136 మంది హిందువులు, 06 మంది ముస్లింలు కలిపి 142 మంది యువతీ యువకుల సామూహిక వివాహ కార్యక్రమాన్ని ఒకే భారీ మంటపం కింద నిర్వహించారు. పండిట్ హిందూ జంటలకు వివాహం యొక్క ప్రాముఖ్యతను వివరించాడు. వివాహ కర్మల ప్రదక్షిణలు, దండలు మార్చుకోవడం నిర్వహించారు. మౌల్వీ ముస్లిం జంటలను తమ వివాహానికి అంగీకరించేలా చేశాడు. రెండు మతాల వివాహాలు ఒకే మంటపం కింద మత సామరస్యంతో జరిగాయి. సాంఘిక సంక్షేమ శాఖ వధువుల ఖాతాల్లో 35 వేల రూపాయలు విరాళంగా అందజేశారు. అదే సమయంలో పెళ్లి నిర్వహణకు ఒక్కో జంటకు రూ.5 వేలు వెచ్చించారు. కాగా దంపతులందరికీ ఒక్కొక్కరికి రూ.10,000 విలువైన గృహోపకరణాలను బహుమతిగా అందజేశారు. చివర్లో అందరికీ విందు కూడా ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!