Expensive Tea: ఒక కప్పు టీ ధర రూ. లక్ష.. దీన్ని తాగాలంటే ఈఎంఐ తీసుకోవాల్సిందే?
- ఒక కప్పు టీకి రూ. 1.14 లక్షలు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక కప్పు టీకి రూ. లక్ష ఉంటుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అవును.. మీరు నమ్మకపోయినా.. ఇది నిజం. దుబాయ్‌లోని ఒక రెస్టారెంట్ మెనూలో లక్ష రూపాయల టీ కనిపిస్తుంది. ఈ ‘గోల్డ్ కడక్’ టీ ధర ఆకాశాన్నంటుతోంది. దుబాయ్‌లో భారతీయ సంతతికి చెందిన పారిశ్రామికవేత్త సుచేతా శర్మ రెస్టారెంట్‌లో ఈ ఖరీదైన చాయ్‌ని అమ్ముతున్నారు. ఈ బోహో కేఫ్ లో టీ ధర AED 5000 (సుమారు రూ. 1.14 లక్షలు). 24 క్యారెట్ల బంగారు పూత కలిపిన ఈ టీని స్వచ్ఛమైన వెండి కప్పులో అందిస్తారు. ఒక్కో సిప్ లో వేడివేడి చాయ్ తో పాటు బంగారాన్ని కూడా తాగేయొచ్చు. టీ తాగాక కప్పును అక్కడే వదిలేయకుండా ఇంటికి కూడా తీసుకెళ్లొచ్చట.
READ MORE: Magical Stumping: నేపాల్ ప్రీమియర్ లీగ్‌లో అద్భుతమైన ఘటన.. మీరే చూసేయండి (వీడియో)
Also Read
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
ఈ రెస్టారెంట్ బోహో కేఫ్ ఎమిరేట్స్ ఫైనాన్షియల్ టవర్స్ లో ఉంది. ఇక్కడ మెనులో భారతీయ ఆహార పదార్థాలు కూడా ఉంటాయి. ప్రీమియం ఐటెమ్‌లలో గోల్డ్ సావనీర్ కాఫీ, గోల్డ్ డస్టెడ్ క్రోసెంట్స్, గోల్డ్ డ్రింక్స్, గోల్డ్ ఐస్ క్రీం కూడా ఉన్నాయి. ఈ ఖరీదైన పదార్థాల గురించి సుచేతా శర్మ మాట్లాడుతూ.. “మేము లగ్జరీని కోరుకునే వ్యక్తుల కోసం ఇలాంటి వాటిని తయారు చేస్తున్నాం. అంతే కాకుండా మేము గోల్డ్ సావనీర్ కాఫీ కూడా సర్వ్ చేస్తున్నాం. ఇది కూడా వెండి పాత్రలో అందిస్తాం. దీని ధర AED 4761 (సుమారు రూ. 1.09 లక్షలు). ఈ కప్‌లు కూడా మీరు ఇంటికి తీసుకెళ్లొచ్చు. ” అని పేర్కొన్నారు.
READ MORE:TG Assembly: లగచర్ల రైతులకు బేడీల విషయంలో బీఆర్‌ఎస్ నిరసన.. అసెంబ్లీ రేపటికి వాయిదా
అయితే ఒక ఫుడ్ వ్లాగర్ బోహో కేఫ్ గురించిన వీడియోను అప్‌లోడ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో రెస్టారెంట్‌లో ఏయే విషయాలు బాగా ఫేమస్, వాటి కోసం ఎంత ధర చెల్లించాల్సి వస్తుందో వివరించింది. అలాగే.. కేఫ్‌లో టీ, కాఫీ అందించే విధానం ఎంత ప్రత్యేకమైనదో ప్రస్తావించింది. అయితే.. దీనిపై ప్రజలు రకరకాలుగా స్పందించారు. ఈ టీతో ప్రయోజనం ఏమిటంటూ చాలా మంది ప్రశ్నలు లేవనెత్తారు. సామాన్యుడికి అత్యంత చేరువైనది టీ.. దానికి రూ.లక్షకు ఎలా విక్రయిస్తారని ప్రశ్నించారు. “గోల్డ్ కడక్ టీ తాగాలంటే ఈఎంఐ కట్టాల్సిందే” అని ఓ వ్యక్తి వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.
తాజావార్తలు
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!