ప్రస్తుత కాలంలో యువత చిన్న చిన్న విషయాలకే షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫోన్ కొనివ్వలేదని, నచ్చిన బైక్, కారు ఇప్పించలేదని క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రేమ విఫలమైనా తట్టుకోలక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నిండు నూరేళ్ల జీవితాన్ని మధ్యలోనే ముగిస్తున్నారు. పిల్లలే లోకంగా జీవిస్తున్న తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చుతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ యువకుడు తల్లిదండ్రులు తనకు బైక్ కొనివ్వలేదని దారుణానికి ఒడిగట్టాడు. వీణవంక మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు.