‘దండోరా’ ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో పెద్ద దుమారమే రేపాయి. హీరోయిన్లు పద్ధతిగా ఉండాలని ఆయన అనడంపై అనసూయ, చిన్మయి లాంటి వారు తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా నిధి అగర్వాల్‌కు జరిగిన ఇన్సిడెంట్‌ను సాకుగా చూపిస్తూ శివాజీ మాట్లాడటం.. ‘తప్పు చేసే వాళ్ళని వదిలేసి, మాకు నీతులు చెబుతారా?’ అని అనసూయ ఫైర్ అవ్వడంతో ఈ గొడవ ‘శివాజీ వర్సెస్ అనసూయ’గా మారిపోయింది. నాగబాబు, ప్రకాష్ రాజ్ లాంటి వారు కూడా అనసూయకు మద్దతు ఇవ్వడంతో సోషల్ మీడియా రెండు వర్గాలుగా విడిపోయింది. కానీ సడెన్‌గా ఏం జరిగింతో తెలిదు కానీ.. అనసూయ ఈ విషయంలో తన రూట్ మార్చినట్లు కనిపిస్తుంది.
Also Read : Shraddha Kapoor : పెళ్లి పై శ్రద్ధా కపూర్ క్లారిటీ.. మరి పెళ్లి కొడుకు అతడేనా?
తాజాగా శివాజీ ఉద్దేశాన్ని పాజిటివ్‌గా అర్థం చేసుకుంటూ ఆమె కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శివాజీ ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో ఈ స్థాయికి చేరుకున్నారు.. ప్రజలు తన మాట వినే స్థాయికి ఎదిగారు, ఆడపిల్లల భద్రత కోసం ఆయన పడ్డ ఆరాటం వెనుక మంచి ఉద్దేశమే ఉందని ఆమె పేర్కొన్నారు. కాకపోతే, కేవలం అమ్మాయిలకే కాకుండా.. అబ్బాయిలకు కూడా వాళ్ల బాధ్యతను గుర్తు చేసి ఉంటే ఈ వివాదం వచ్చేది కాదు.. అంటూ ఆమె సున్నితంగా సర్దిచెప్పారు. దీంతో కొద్ది రోజులుగా సాగుతున్న ఈ మాటల యుద్ధానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది. ప్రజంట్ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది.