Thalapathy Vijay: ఇదేం అభిమానం రా అయ్యా… హీరో విజయ్ కారు ధ్వంసం చేసిన ఫాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thalapathy Vijay Car Was Vandalized By Kerala Fans after rally in Kerala: సినిమా షూటింగ్ కోసం కేరళ వెళ్లిన నటుడు విజయ్ కారు అద్దాలను అభిమానులే పగలగొట్టడం కలకలం రేపింది. తమిళ సినీ ప్రముఖ నటుడు విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. అంతే కాకుండా ప్రశాంత్, ప్రభుదేవా, లైలా, స్నేహ, అజ్మల్ అమీర్, ప్రేమ్ జీ అమరన్, యోగి బాబు, వీటీవీ గణేష్, వైభవ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ నిర్మిస్తోంది. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ కోసం విజయ్ ఈ రోజు కేరళ వెళ్లాడు. విమానంలో చెన్నై నుంచి తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇక ఆ తరువాత విజయ్ కారు వెంట పలువురు అభిమానులు ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలపై ర్యాలీగా వెళ్లారు.
Anupama: బోల్డ్ అంటూ బోలెడు ప్రశ్నలు.. బరస్టయిన అనుపమ
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
- Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? 'ప్యారడైజ్' బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
- Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
తలైవా.. తలైవా.. తలపతి.. తలపతి అంటూ నినాదాలు చేస్తూ దారి పొడవునా సందడి చేస్తూ వెళ్లారు. ఈ సందర్భంలో విజయ్‌ని చూసేందుకు అభిమానులు అధికంగా రావడంతో పాటు కారు మీద పడడంతో విజయ్ ప్రయాణిస్తున్న కారు అద్దం పగిలిపోయింది . కారు కూడా జనంలో ఇరుక్కుపోయి కదలలేక పోయింది. లోపల కూర్చున్న విజయ్ కూడా కొంచెం కంగారు పడ్డాడు. అభిమానుల తాకిడికి కారు అద్దాలు పగిలిపోయాయి. అలాగే చాలా చోట్ల కారు వెనుక, ముందు భాగాలు దెబ్బతిన్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత విజయ్ కేరళ వస్తున్నాడని తెలుసుకున్న కేరళ విజయ్ అభిమానులు ఆయన్ను చూసేందుకు ఎగబడ్డారు. తమ ప్రేమను ఎలా వ్యక్తపరిచారో చూసి విజయ్ చలించిపోయాడు. రద్దీ ఎక్కువగా ఉండటంతో తిరువనంతపురంలోని ఎయిర్ పోర్ట్ కిక్కిరిసిపోయింది. అభిమానులు విజయ్ కారును నలువైపుల నుంచి చుట్టుముట్టి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో నటుడు విజయ్ చాలా కష్టపడి హోటల్‌కు చేరుకున్నాడు. ఇక ఆయన కారు ధ్వంసమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!