Komatireddy Rajgopal Reddy : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆడియో లీక్‌పై స్పందించిన రాజగోపాల్ రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల్లోని కీలక నేతలు ఇతర పార్టీలకు వలసలు పోతున్నారు. అయితే.. గతంలో కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ మారుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి చేరిన విషయం తెలిసిందే. దీంతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీని వీడతున్నట్లు ప్రచారం జరిగింది. దీనిపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్లారిటీ ఇస్తూ.. నేను చచ్చే వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన పార్టీ మారడంపై స్పష్టత నెలకొంది. అయితే.. తాజాగా మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సంబంధించిన ఓ ఆడియో కలకలం రేపుతోంది. ఈ ఆడియోను ఆయుధంగా చేసుకొని ప్రత్యర్థులు విజృంభిస్తున్న క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. సోదరుడు వెంకట్ రెడ్డి పై దుష్ప్రచారం చేస్తున్నారని, ఆయన ప్రజలకోసం కృషి చేసే వ్యక్తి అని అన్నారు రాజగోపాల్ రెడ్డి.
Read Also : TSRTC : ఆర్టీసీ ఉద్యోగులకు అదిరేపోయే న్యూస్.. ఆ డబ్బులు చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్
టీఆర్‌ఎస్ తో కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యిందని, కాంగ్రెస్ అభ్యర్ధి స్రవంతికి సీఎం కేసీఆర్ డబ్బులు పంపిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వారిని.. ఏడ్చే మొగవాడిని నమ్మ వద్దంటూ ఆయన విమర్శలు చేశారు. కవిత, రేవంత్ మధ్య ఆర్ధిక, ఇతర సంబంధాలు ఉన్నాయని, కవిత, రేవంత్ పాట్నర్‌లు అని, కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో టీఆర్‌ఎస్ పార్టీ కి చెందిన వారు చాలా మంది తను గెలువాలని కోరుకుంటున్నారన్నారు రాజగోపాల్‌రెడ్డి. రాజగోపాల్ రెడ్డికి మునుగోడు నియంత కేసీఆర్ తో యుద్ధం జరుగుతుందని, తెలంగాణ భవిష్యత్ మునుగోడు ఎన్నిక మీద ఆధార పడిందని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..