Vadivelu: స్టార్ కమెడియన్ ఇంట తీవ్ర విషాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vadivelu Brother Jagadeeswaran Passed away: తమిళంలో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్న వడివేలు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈ మధ్యనే వడివేలు తల్లి అనారోగ్య కారణాలతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ విషాదం నుంచి ఇంకా బయటపడకుండానే ఇప్పుడు వడివేలు తమ్ముడు జగదీశ్వరన్ కూడా కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. ఆయన వయసు ఇప్పుడు 55 సంవత్సరాలు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న జగదీశ్వరన్ ప్రస్తుతం మధురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్లు తెలుస్తోంది. అన్న వడివేలు మాదిరిగానే జగదీశ్వరన్ సైతం పలు సినిమాల్లో నటించారు. కానీ పూర్తిస్థాయిలో రాణించలేకపోయారు. అవకాశాలు కూడా కరువైన నేపథ్యంలో గార్మెంట్ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు.
Samantha: అర్ధరాత్రి అతడితో వీడియో కాల్.. అడ్డంగా దొరికిపోయిన సామ్
Also Read
వడివేలుకు ముగ్గురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారని తెలుస్తోంది. వారిలో జగదీశ్వరన్ కి సినిమాల మీద ఆసక్తి ఉండడంతో, తమిళ సినిమాల్లో అవకాశాల ప్రయత్నం చేశాడు. అయితే నటనా రంగంలో పెద్దగా విజయం సాధించకపోవడంతో, జగదీశ్వరన్ మధురైలో తన వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించి విజయవంతంగా నడుపుతున్నాడు. అంతకుముందు, ఒక ఇంటర్వ్యూలో, వడివేలు తనకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉండేవారని, తననే కాకుండా తన తోబుట్టువులందరినీ చూసుకునేవారని వెల్లడించారు. వడివేలు ఇటీవల మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన మామన్నన్‌లో కనిపించారు. ఈ సినిమాకి తమిళంలో మంచి పాజిటివ్ బజ్ తెచ్చుకుంది. ఈ సినిమాలో వడివేలు నటనకి మంచి ప్రశంసలు లభించాయి. ఇక ఇప్పుడు రాఘవ లారెన్స్ హీరోగా నటించిన చంద్రముఖి 2 లో కూడా కనిపించనున్నారు.
తాజావార్తలు
-
Bengaluru IT Jobs: బెంగళూరులో ఉద్యోగాలు తెలుగు, తమిళులకేనా? యువతి ఆరోపణలపై సీఎం వార్నింగ్!
-
Inter Board: 3,241 కాలేజీలకు ఇంటర్ బోర్డు గుర్తింపు.. వాటిపై క్లారిటీ
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
-
Mallikarjun Kharge: ‘మోదీ తండ్రి కూడా పోతాడు’.. ప్రధానిపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు!
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
ట్రెండింగ్
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!